ఆదాయంపై ఆర్టీసీ దృష్టి

ABN , First Publish Date - 2021-06-13T05:11:58+05:30 IST

లాక్‌డౌన్‌ సడలింపుతో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆదాయ వనరులపై దృష్టి పెట్టింది. దాదాపు 15నెలలు తీవ్రనష్టాలు చవిచూసిన ఆర్టీసీ ప్రస్తుతం రా బడిపై కార్యాచారణను రూపొ ందిస్తోంది. లాక్‌డౌన్‌ కారణం గా మొదటి, రెండో విడతలలో పూర్తిస్తాయిలో ఆర్టీసీ బస్సుల రాకపోకలు నిలి చిపోయి తీవ్ర నష్టా లు ఎదురయ్యా యి.

ఆదాయంపై ఆర్టీసీ దృష్టి

లాక్‌డౌన్‌ సడలింపుతో ఆదాయ వనరులపై దృష్టి సారించిన ఆర్టీసీ అధికారులు
ఆర్టీసీ బస్సులన్నింటినీ నడిపేందుకు ఏర్పాట్లు

బోధన్‌, జూన్‌ 12: లాక్‌డౌన్‌ సడలింపుతో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆదాయ వనరులపై దృష్టి పెట్టింది. దాదాపు 15నెలలు తీవ్రనష్టాలు చవిచూసిన ఆర్టీసీ ప్రస్తుతం రా బడిపై కార్యాచారణను రూపొ ందిస్తోంది. లాక్‌డౌన్‌ కారణం గా మొదటి, రెండో విడతలలో పూర్తిస్తాయిలో ఆర్టీసీ బస్సుల రాకపోకలు నిలి చిపోయి తీవ్ర నష్టా లు ఎదురయ్యా యి. లాక్‌డౌన్‌ ఎత్తేసిన తర్వాత కూడా ఆంక్షలు కొనసాగడంతో ఆర్టీసీ బస్సుల్లో రాకపోకలు అంతంతా మా త్రంగానే ఉండడంతో ఆర్టీసీకి ఆశించిన స్థాయిలో ఆదాయం రాలేదు. నిజా మాబాద్‌, కామారెడ్డి జిల్లాల పరిధిలో ఆరు ఆర్టీసీ డిపోలు ఉండగా.. ఒక్కో డిపో పరిధిలో సుమారు 100 నుంచి 130 వరకు ఆర్టీసీ బస్సులు ఉన్నాయి. వీటిలో దాదాపు 30 నుంచి 50 వరకు ప్రైవేటు బస్సులు ఉండగా.. మిగతావ న్నీ ఆర్టీసీ సొంత బస్సులే. అయితే, లాక్‌డౌన్‌ సడలింపుతో ఆర్టీసీ పూర్తిస్థాయి లో సొంత బస్సులనే నడిపేందుకు సన్నద్ధమైంది. ఒక్కో డిపో పరిధిలో సు మారు 400 మందిపైనే కార్మికులుండగా.. ఆరు డిపోల పరిధిలో మూడున్నర వేల మంది కార్మికులున్నారు. ఒక్కో డిపో పరిధిలో రోజువారి ఖర్చు రూ.17ల క్షలపైనే ఉండగా.. ఆదాయం మాత్రం రూ.13లక్షలలోపే ఉంది. ప్రస్తుతం అరకొరగా ఆర్టీసీ బస్సులు నడుస్తుండడంతో ఒక్కో డిపోలో రూ.3లక్షలలోపే ఆదాయం వస్తోంది. అంటే ఒక్కో డిపో పరిధిలో నిత్యం లక్షలాది రూపాయల నష్టం వాటిల్లుతోంది. అంటే ఒక్కో డిపో పరిధిలో ప్రతినెలా కోటి రూపాయల పైనే నష్టం వాటిల్లుతోంది. అయితే, ప్రభుత్వం ఉదయం 6 నుంచి సాయం త్రం 6 వరకు సడలింపు ఇవ్వడంతో ఆర్టీసీ ఆదాయ వనరులను మెరుగుప ర్చుకునేందుకు దృష్టి పెట్టింది. నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల పరిధిలో ఆ రు డిపోలలో గురువారం నుంచి అన్ని ఆర్టీసీ బస్సులను నడిపే ఏర్పాట్లు చే శారు. మరో వారం రోజుల్లో పూర్తిస్థాయిలో పరిస్థితులు చక్కదిద్దుకోను న్నాయి. అన్ని డిపోల పరిధిలో సొంత ఆర్టీసీ బస్సులను మొదటగా నడిపి ఆదాయం సమకూర్చుకునేందుకు ఆర్టీసీ కసరత్తు మొద లుపెట్టింది. ప్రైవేటు బస్సులు మినహాయించి ఆర్టీసీ బస్సుల ను పూర్తిస్థాయిలో నడిపి ఆదాయాన్ని రాబట్టుకునేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
ఆర్టీసీ బస్సులన్నింటినీ నడుపుతాం
- రమణ, డిపో మేనేజర్‌, బోధన్‌

లాక్‌డౌన్‌ సడలింపుతో ఆర్టీసీ బస్సులన్నింటినీ నడిపేందుకు ఏర్పాట్లు చే స్తున్నాం. డిపోల పరిధిలో ఆర్టీసీ సొంత బస్సులను మొదటగా ప్రారంభించి ఆదాయ వనరులను సమకూర్చుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. గురువా రం నుంచి ఆర్టీసీ సొంత బస్సులన్నింటినీ ప్రారంభించాం. ప్రైవేటు బస్సుల ను నిలిపివేసి సొంత బస్సులను నడిపి ఆదాయ వనరులను పెంచుకునేందు కు ఏర్పాట్లు చేస్తున్నాం.

Updated Date - 2021-06-13T05:11:58+05:30 IST