కార్మికుల సంక్షేమమే ధ్యేయం

ABN , First Publish Date - 2021-03-08T05:39:08+05:30 IST

కార్మికుల సంక్షేమమే ఽధ్యేయమని, ఏపీటీసీ అభివృద్ధికి సమష్టి కృషి చేస్తామని ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ రవాణా శాఖ (ఏపీటీసీ) మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఆర్‌పీ ఠాకూర్‌ తెలిపారు.

కార్మికుల సంక్షేమమే ధ్యేయం
నెల్లూరు ఆర్టీసీ ప్రఽధాన బస్టాండ్‌లో పర్యటిస్తున్న సంస్థ ఎండీ ఆర్పీ ఠాకూర్‌, తదితరులు

సమష్టి కృషితోనే ఏపీటీసీ అభివృద్ధి

సంస్థ ఎండీ ఆర్‌పీ ఠాకూర్‌


నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట)మార్చి 7:  కార్మికుల సంక్షేమమే ఽధ్యేయమని, ఏపీటీసీ అభివృద్ధికి సమష్టి  కృషి చేస్తామని ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ రవాణా శాఖ (ఏపీటీసీ) మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఆర్‌పీ ఠాకూర్‌ తెలిపారు. ఆదివారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. కోవూరు సమీపంలోని వర్క్‌షాప్‌తోపాటు ఏపీటీసీ ప్రధాన బస్టాండు, కాకుటూరు లోని ఏపీటీసీ జోనల్‌ వర్క్‌షాప్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఠాకూర్‌ మాట్లాడుతూ  నెల్లూరులోని రెండు ప్రధాన బస్టాండ్లలో ప్రయాణికులు ఎక్కువుగా ఉన్నరన్న ఆనందం వ్యక్తం చేశారు. సంస్థ అభివృద్ధికి అందరం కుటుంబసభ్యులుగా కలిసి పనిచేద్దామన్నారు. కార్మికులకు ఏ సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకు వస్తే వెంటనే పరిష్కరిస్తామన్నారు. పెండింగ్‌లో ఉన్న బకాయిలను దశలవారీగా మంజూరు చేస్తామన్నారు. ఫిబ్రవరిలో నెల్లూరు రీజియన్‌ పరిధిలోని గూడూరు, నెల్లూరు-1, సూళ్లూరుపేట డిపోలు లక్ష్యాలను సాధించి అవార్డులను పొందడం ఆనందంగా ఉందన్నారు. మార్చిలో రీజియన్‌ పరిధిలోని పది డిపోలు అవార్డులు పొందాలని సూచించారు. అనంతరం అవార్డులు పొందిన గూడూరు, సూళ్లూరుపేట, నెల్లూరు-1 డిపోల డిఎంలకు అవార్డులు అందజేశారు. ఈ క్రమంలో పలు కార్మిక సంఘాల నాయకులు సమస్యలు పరిష్కరించా లని వినతిపత్రం అందించారు. త్వరలోనే సమస్యలను పరిష్కరిస్తామని ఎండీ హామీ ఇచ్చారు. ఆయన వెంట జోనల్‌ ఈడీ గోపినాథ్‌రెడ్డి, ఆర్‌ఎం శేషయ్య, డిప్యూటి సీటీఎం, సీఎంఈ, డీఎంలు, తదితరులు ఉన్నారు.

 

నాలుగు కరోనా కేసుల నమోదు

నెల్లూరు (వైద్యం)మార్చి 7 : జిల్లాలో ఆదివారం నాలుగు కరోనా పాజటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం  కేసులు 64,068కి చేరాయి. ఎలాంటి కరోనా మరణాలు సంభవించలేదు. అలాగే కరోనా నుంచి కోలుకున్న నలుగురిని అధికారులు డిశ్చార్జి చేశారు. 

Updated Date - 2021-03-08T05:39:08+05:30 IST