డిపో మేనేజర్‌ తీరుకు నిరసనగా ధర్నా

ABN , First Publish Date - 2021-04-17T05:52:56+05:30 IST

సమ్మె ఒప్పం దాన్ని ఉల్లంఘిస్తూ అమలాపురం ఆర్టీసీ డిపో మేనేజర్‌ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడాన్ని నిరసిస్తూ జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం డిపో ప్రాంగణంలో కార్మికులు ధర్నా నిర్వహించారు.

డిపో మేనేజర్‌ తీరుకు నిరసనగా ధర్నా

అమలాపురం రూరల్‌, ఏప్రిల్‌ 16: సమ్మె ఒప్పం దాన్ని ఉల్లంఘిస్తూ అమలాపురం ఆర్టీసీ డిపో మేనేజర్‌ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడాన్ని నిరసిస్తూ జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం డిపో ప్రాంగణంలో కార్మికులు ధర్నా నిర్వహించారు. అమలాపురం-విజయవాడ డ్యూటీలను మార్పు చేయడంతో పాటు డ్రైవర్లకు సరైన విశ్రాంతి లేకుండా చేసిన నిర్ణయాలను నిర సిస్తూ కార్మికులు ధర్నాకు దిగారు. కార్మికులను కించ పరిచేలా డిపో మేనేజర్‌ వ్యవహరిస్తున్నారని ఆరోపిం చారు. సీనియారిటీ ప్రకారం ఓడీలు చెల్లించాలని, సిక్‌ జీతాలు ఇవ్వాలని, డిపో మేనేజర్‌ తీరు మార్చుకునేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. జేఏసీ కన్వీనర్‌ ఎం.మణిరాజు, నాయకులు టీవీ రమణ, పీఎన్‌కేడీ రావు, పందిరి రాంబాబు, వి.గణపతి రావు, కె.రంగప్రసాద్‌, ఎన్‌ శ్రీను  పాల్గొన్నారు. 



Updated Date - 2021-04-17T05:52:56+05:30 IST