అనంతపురం: హిందూపురంలోని కొట్నూరు చెరువు మరువంక వద్ద ఆర్టీసీ బస్సు అదుపు తప్పింది. తూముకుంట వైపు వెళ్తూ..కాజ్వే దాటుతుండగా వరద ఉధృతికి బస్సు అదుపు తప్పడంతో బస్సు డ్రైవర్ అప్రమత్తమయ్యాడు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. బస్సులో ఉన్న ప్రయాణికులను సురక్షితంగా కిందకు దింపడంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు.