ఆర్టీసీ డ్రైవర్‌ బలవన్మరణం

ABN , First Publish Date - 2022-06-27T04:57:44+05:30 IST

ఆర్టీసీ ఉన్నతాధికారుల తీరుతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆర్టీసీ డ్రైవర్‌ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఆర్టీసీ డ్రైవర్‌ బలవన్మరణం
స్వామి(ఫైల్‌)

సిద్దిపేట రూరల్‌, జూన్‌ 26: ఆర్టీసీ ఉన్నతాధికారుల తీరుతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆర్టీసీ డ్రైవర్‌ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన  సిద్దిపేట రూరల్‌ మండలం సీతారాంపల్లి గ్రామ శివారులో ఆదివారం చోటుచేసుకున్నది. వివరాల్లోకి వెళ్తే..  సీతారంపల్లి గ్రామానికి చెందిన  పడిగె స్వామి(45) హైదరాబాద్‌లోని రాణిగంజ్‌ ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా ఉద్యోగం నిర్వహిస్తున్నాడు ఏడాది క్రితం కంటికి దెబ్బ తగలడం వల్ల కొంత శాతం కంటిచూపు మందగించింది. దీంతో ఆర్టీసీ అధికారులు స్వామిని విధులకు అనుమతించలేదు. ఏడాది కాలంగా తలెత్తిన ఆర్థిక ఇబ్బందులతో కుటుంబ పోషణ భారంగా మారిందని, తనకు ఉపాధి కల్పించాలని పలుమార్లు ఉన్నతాధికారులను సంప్రదించినా ఫలితం లేకపోయింది. ఆర్టీసీ అధికారుల తీరుతో తన ఉపాధి పోయిందని స్వామి తీవ్ర మనస్తాపానికి గురైన స్వామి ఆదివారం సీతారంపల్లి గ్రామశివారులో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్వామి కుటుంబాన్ని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని, కుటుంబ సభ్యులకు ఉద్యోగం కల్పించాలని గ్రామస్థులు డిమాండ్‌ చేశారు. ఈ విషయం తెలుసుకున్నా రూరల్‌ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహానికి పంచనామా నిర్వహించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.  

Updated Date - 2022-06-27T04:57:44+05:30 IST