ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం
ABN , First Publish Date - 2021-08-29T01:05:57+05:30 IST
ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం సంస్థలో కలకలం
కామరెడ్డి: ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం సంస్థలో కలకలం రేపింది. బాన్సువాడ ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న బలరాం అనే డ్రైవర్ పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. బలరాంను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. డ్యూటీల విషయంలో తనను డిపో అధికారులు వేధిస్తున్నారని బలరాం ఆరోపించారు.