ఆర్టీసీలో డిపోలో డీజిల్‌ దందా

ABN , First Publish Date - 2020-12-06T04:20:13+05:30 IST

ఆర్టీసీ బస్సుల్లో కేఎంపీఎల్‌ పెంచేందుకు అధికారులు నానా పద్ధతులు అవలంభిస్తున్నారు. వాస్తవానికి బస్సుల్లో కేఎంపీఎల్‌ (కిలోమీటర్‌ ఫర్‌ లీటర్‌) పెరగక పోయి నా ఉన్నతాధికారుల మెప్పు పొందేందుకు మంచిర్యా ల డిపోకు చెందిన అధికారులు నటిస్తున్నారు.

ఆర్టీసీలో డిపోలో డీజిల్‌ దందా
ట్యాంకర్‌ నుంచి డ్రమ్ములో ఇంధనం నింపుతున్న కార్మికులు

తప్పుడు లెక్కలతో కేఎంపీఎల్‌ పెంచేందుకు ఆరాటం

డ్రమ్ముల్లో ఇంధనం నింపుతూ అద్దె బస్సులకు అమ్మకం

సహకరించని కార్మికులపై పని భారం

మంచిర్యాల డిపోలో అక్రమాలు

మంచిర్యాల, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ బస్సుల్లో  కేఎంపీఎల్‌ పెంచేందుకు అధికారులు నానా పద్ధతులు అవలంభిస్తున్నారు. వాస్తవానికి బస్సుల్లో కేఎంపీఎల్‌  (కిలోమీటర్‌ ఫర్‌ లీటర్‌) పెరగక పోయి నా ఉన్నతాధికారుల మెప్పు పొందేందుకు మంచిర్యా ల డిపోకు చెందిన అధికారులు నటిస్తున్నారు. ఇం దుకు అక్రమ పద్ధతులకు  తెర తీస్తున్నారు. ఈ తతంగమంతా తెలియని ఆర్టీసీ ఉన్నతాధికారులు సదరు కిందిస్థాయి అధికారులకు వత్తాసు పలుకుతూ ట్రాన్స్‌ఫర్లు చేయకుండా దశాబ్దాలపాటు ఒకేచోట ఉద్యోగం చేసేందుకు వెసులుబాటు కల్పిస్తున్నారు. పదోన్నతులు పొందినా మరో చోటుకి వెళ్లకుండా ఉన్న చోటనే ఉద్యోగం చేస్తున్నారు. డీజిల్‌ను అక్రమంగా డ్రమ్ముల్లో నింపుతూ అవకాశం చిక్కినప్పుడల్లా అద్దె బస్సులకు అమ్ముకుంటూ అందినకాడికి దండుకుంటు న్నారు. తమకు సహకరించని ఉద్యోగులపై పనిభారం పెంచుతూ  వేధిస్తున్నారు. కిందిస్థాయి అధికారుల మాయలతో ఆర్టీసీ ఉన్నతాధికారులను బోల్తా కొట్టిస్తుండగా సంస్థపై అదనపు భారం పడుతోంది. 


అక్రమాలు ఇలా...

బస్సుల్లో ఇంధనం నింపేందుకు మంచిర్యాల డిపో లో రెండు డీజిల్‌ బంకులు ఉన్నాయి. ట్యాంకరులో ఇంధనం డిపోకు రాగానే రెండు బంకుల్లో నింపుతూ అందులో నుంచి కొంత డీజిల్‌ను ఆపి దాన్ని 200 లీటర్ల సామర్థ్యంగల ఖాళీ డ్రమ్ములో పోయిస్తారు. ఉదాహరణకు మంచిర్యాల నుంచి కాగజ్‌నగర్‌ వెళ్లే ఒక బస్సు మూడు ట్రిప్పులు కొట్టేందుకు 384 కిలో మీటర్లు ప్రయాణించాల్సి రాగా, దానికి 70 లీటర్ల ఇంధనం అవసరం అవుతుంది. ఈ లెక్కన సదరు బస్సు 5.48 కేఎంపీఎల్‌ మైలేజీ ఇచ్చినట్లవుతుంది. అయితే కేఎంపీఎల్‌ అధికంగా చూపించేందుకు అధికారులు ఇక్కడ గేమ్‌ ప్లే చేస్తున్నారు. బస్సుకు అవసరమైన 70 లీటర్లలో బంకు నుంచి 65 లీటర్లు నింపుతూ మిగతా 5 లీటర్ల ఇంధనాన్ని డ్రమ్ములో నుంచి పోస్తారు. అధికారిక లెక్కల ప్రకారం (బంకు నుంచి పోసిన ఇంధనం ప్రకారం) సదరు బస్సు తన ప్రయాణానికి 65 లీటర్ల ఇంధనం మాత్రమే ఉప యోగించినట్లు చూపిస్తుండగా, సరాసరి 5.90 కేఎం పీఎల్‌ నమోదవుతుంది. అలా డీజిల్‌ను రెండు రకా లుగా బస్సుల్లో పోస్తూ మంచి కేఎంపీఎల్‌ను తెస్తున్న ట్లు నటిస్తూ ఉన్నతాధికారుల మెప్పు పొందుతున్నా రు. ఇదిలా ఉండగా డ్రమ్ముల్లో అక్రమంగా నింపిన ఇంధనాన్ని అవకాశం చిక్కినప్పుడల్లా అద్దె బస్సులకు పోస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. 


సహకరించని వారిపై పనిభారం...

ఇంధనాన్ని అక్రమంగా డ్రమ్ముల్లో నింపడానికి సహకరించని కార్మికులపై సదరు అధికారులు పని భారం మోపుతూ వేధింపులకు గురి చేస్తున్నట్లు ఆరో పణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా డీజిల్‌ బంకుల వద్ద పనిచేస్తున్న కార్మికులపై వేధింపులు అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. సెలవులు మంజూరు విషయం లోనూ తీవ్రంగా వేధిస్తున్నట్లు కార్మికులు చెబుతు న్నారు. ఆరోగ్యం సహకరించక మెడికల్‌ అన్‌ఫిట్‌ పొం ది గ్యారేజీలో ఇతర విభాగాల్లో పని చేస్తున్న వారిపట్ల కూడా కఠినంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. డీజి ల్‌ బంకు వద్ద మూడు షిఫ్టుల్లో ఉద్యోగులు ఉండాల్సి ఉండగా, ఇద్దరితోనే పని చేయిస్తున్నట్లు కార్మికులు వాపోతున్నారు. ఉదయం 6 నుంచి 2 వరకు, మఽధ్యా హ్నం 2 నుంచి రాత్రి 10, రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మూడు షిఫ్టుల్లో ఉద్యోగులు ఉండాలి. అయితే రాత్రి షిప్టులో ఉద్యోగుల కు విధులు కేటాయించడం లేదని తెలుస్తోంది. అలా రాత్రి సమయాల్లో అద్దె బస్సులకు అక్రమంగా డీజిల్‌ పోయడం, ఇతరత్రా అక్రమాలకు పాల్పడుతున్నట్లు సమాచారం. 


అక్రమాలకు తావులేదు...

మల్లేశయ్య, డిపో మేనేజర్‌

మంచిర్యాల డిపోలో డీజిల్‌లో అక్రమాలు జరుగు తున్నట్లు నా దృష్టికి రాలేదు. అయినా అలాంటి వాటికి ఇక్కడ తావులేదు. ట్యాంకర్‌ నుంచి నేరుగా బంకుల్లో పోయలేని ఇంధనాన్ని ఖాళీ డ్రమ్ములో నిం పుతున్నట్లు సిబ్బంది చెప్పారు. అద్దె బస్సులకు అమ్ము కోవడం, కేఎంపీఎల్‌ కోసం అక్రమాలకు పాల్పడుతు న్నారనేది వాస్తవంకాదు. అయినప్పటికీ ఈ విష యంలో దృష్టి సారించి విచారణ జరిపిస్తాం. 



Updated Date - 2020-12-06T04:20:13+05:30 IST