ప్రయాణికులపై పెనుభారం

ABN , First Publish Date - 2022-07-02T06:37:19+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ఫ్యూయల్‌ సెస్సు పెంపు పేరిట ఆర్టీసీ ప్రయాణికులపై పెనుభారం మోపింది.

ప్రయాణికులపై పెనుభారం

ఆర్టీసీ చార్జీలు భారీగా పెంపు

గరిష్ఠంగా రూ.200 వరకూ బాదుడు


ద్వారకా బస్‌స్టేషన్‌, జూలై 1: రాష్ట్ర ప్రభుత్వం ఫ్యూయల్‌ సెస్సు పెంపు పేరిట ఆర్టీసీ ప్రయాణికులపై పెనుభారం మోపింది. శ్రీకాకుళం, విజయనగరం, కాకినాడ, రాజమండ్రి, ఇచ్ఛాపురం, భద్రాచలం, హైదరాబాద్‌, అమలాపురం, తిరుపతి, బరంపురం, గుణుపూర్‌ వంటి దూర ప్రాంతాలకు రాకపోకలు సాగించే ప్రయాణికులపై ఈ భారం చాలా అధికంగా ఉంది. సర్వీస్‌, దూరాన్ని బట్టి 15 రూపాయల నుంచి 200 రూపాయల వరకూ అదనంగా చెల్లించవలసి వస్తున్నది. విశాఖపట్నం-తిరుపతి చార్జీ రూ.1190 నుంచి రూ.1380కి పెరిగింది. ఒకేసారి ఇంత మొత్తంలో చార్జీలు పెంచడంతో ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు. ఆర్టీసీ ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు ఇంతమొత్తంలో చార్జీలు పెంచిన సందర్భాలు లేవని అంటున్నారు. 

శుక్రవారం అర్ధరాత్రి నుంచి పెరిగిన చార్జీల వివరాలిలా ఉన్నాయి.

Updated Date - 2022-07-02T06:37:19+05:30 IST