మళ్లీ ఊడిన ఆర్టీసీ బస్సు చక్రం

ABN , First Publish Date - 2021-10-20T06:23:51+05:30 IST

ఏపీఎస్‌ ఆర్టీసీ బస్సుల నిర్వహణపై ఇటీవలిగా విమర్శలు వ స్తూనే ఉన్నాయి. ఏకంగా బస్సు చ క్రాలు ఊడిపోతుండడంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

మళ్లీ ఊడిన ఆర్టీసీ బస్సు చక్రం
కాలసముద్రం వద్ద తిరుపతి రూట్‌ బస్సుకు చక్రం ఊడిపోవడంతో రోడ్డుపక్కన ఆపిన దృశ్యం

త్రుటిలో తప్పిన పెనుప్రమాదం

అనంతపురం టౌన, అక్టోబరు 19: ఏపీఎస్‌ ఆర్టీసీ బస్సుల నిర్వహణపై ఇటీవలిగా విమర్శలు వ స్తూనే ఉన్నాయి. ఏకంగా బస్సు చ క్రాలు ఊడిపోతుండడంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయి నా.. నిర్వహణలో మార్పు రాలేదు. అందుకు తాజా ఘటనే ఉదాహరణ. అనంతపురం రీజియనకు చెందిన ఆర్టీసీ బస్సుకు చక్రం ఊ డిపోవడంతో పెనుప్రమాదం త ప్పింది. అనంతపురం డిపో నుంచి తిరుపతికి దాదాపు 45 మంది ప్రయాణికులతో సూపర్‌ లగ్జరీ బస్సు మంగళవారం మధ్యాహ్నం బయల్దేరింది. కదిరి రూరల్‌ మండలం కాలసముద్రం వద్దకు వెళ్లగానే బస్సు వెనుక చక్రానికి బోల్టులు ఊడిపోయి, చక్రం విడిపోయింది. అప్రమత్తమైన డ్రైవర్‌ వెంటనే బస్సును రో డ్డు పక్కన ఆపడంతో పెనుప్రమాదం తప్పింది. రన్నింగ్‌లో ఉన్న బస్సు చక్రం ఊడిపోవడంతో అందులోని ప్రయాణికులంతా భయాందోళనలకు లోనయ్యారు. డ్రైవర్‌ బస్సును రోడ్డుపక్కన ఆపడంతో ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం బస్సుకు చక్రాన్ని బిగించి, తిరిగి ప్రయాణికులను బస్సులోకి ఎక్కించుకుని తిరుపతికి వెళ్లాల్సొచ్చింది.


ఘటనపై అధికారుల నిర్లక్ష్యం...

మంగళవారం తిరుపతి రూట్‌ బస్సుకు చక్రం ఊడిపోయిన ఘటనపై అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శించారు. ఈ వ్యవహారంలో అనంతపురం డిపో మేనేజర్‌పై విచారణ చేపట్టాల్సిన అధికారులు.. ఆ మేరకు స్పందించలేదు. సదరు డిపో మేనేజర్‌ ఇటీవల బదిలీ అవడంతో ఆయనను రిలీవ్‌ చేయడంలోనే నిమగ్నమయ్యారు. దీంతో ప్రయాణికుల క్షేమంపై శ్రద్ధ ఏదీ అంటూ పలువురు ఆర్టీసీ సిబ్బంది గుసగుసలాడుకుంటున్నారు.

Updated Date - 2021-10-20T06:23:51+05:30 IST