పత్తాలేని పల్లె వెలుగు

ABN , First Publish Date - 2022-01-18T05:40:43+05:30 IST

పల్లె వెలుగు బస్సులు ప్రయాణికులకు ఏమాత్రం సౌకర్యవంతంగా లేవు.

పత్తాలేని పల్లె వెలుగు

గ్రామీణ ప్రాంతాలకు బస్సు సర్వీసులు కుదింపు


బుట్టాయగూడెం, జనవరి 17: పల్లె వెలుగు బస్సులు ప్రయాణికులకు ఏమాత్రం సౌకర్యవంతంగా లేవు. ఒక్కమాటలో చెప్పాలంటే పల్లె వైపు రావ డం లేదు. సాధారణ ప్రయాణికులు గ్రామాల్లో ప్రయాణానికి, ఇతర ప్రాంతా లకు వెళ్లడానికి పల్లె వెలుగు సర్వీసులు అందుబాటులో ఉండేవి. సాధారణ ఖర్చులతో విద్య, వైద్యం తదితర అవసరాలకు వెళ్లివచ్చేవారు. ప్రస్తుతం సర్వీ సులు అందుబాటులో లేకపోవడంతో ప్రైవేటు వాహనాల్లో అధిక మొత్తం చెల్లించాల్సి వస్తోందని పలువురు వాపోతున్నారు. జంగారెడ్డిగూడెం నుంచి బుట్టాయగూడెం, కన్నాపురం మీదుగా చింతపల్లి, రెడ్డికోపల్లె వరకు నిత్యం రెండు పర్యాయాలు బస్సు సర్వీసు ఉండేది. గరిష్ఠంగా రూ.30 చార్జితో మా రుమూల చింతపల్లికి కూడా గిరిజనులు ప్రయాణించేవారు. ప్రస్తుతం జంగారెడ్డిగూడెం వరకు వెళ్లడానికే రూ.100, రాను పోను రూ.200 జేబులో ఉండాల్సిందే. జంగారెడ్డిగూడెం నుంచి బుట్టాయగూడెం మీదుగా అలివేరు, కామవరం, పందిరిమామిడిగూడెం గ్రామాలకు బస్సులు రోజుకు ఆరు ట్రి ప్పులకు నడిచేవి. చార్జీ రూ. 30 నుంచి రూ.35 ఉండేది. ప్రస్తుతం బస్సు సర్వీసులు లేకపోవడంతో అలివేరు నుంచి జంగారెడ్డిగూడెం వెళ్లడానికి ఆటో లకు రూ.100 చెల్లించాలి. అశ్వారావుపేట నుంచి జీలుగుమిల్లి, బుట్టాయ గూడెం మీదుగా రాజమండ్రి బస్సు సర్వీసు ఏజెన్సీవాసులకు ఎంతో సౌకర్య వంతంగా ఉండేది. రూ.45 చార్జీతో ప్రయాణం సాగించేవారు. ప్రస్తుతం ఆ సర్వీసు లేకపోవడంతో వందలు వెచ్చించి ప్రైవేటు వాహనాల్లో ప్రయాణిం చాల్సి వస్తోందని గ్రామీణ ప్రాంతవాసులు వాపోతున్నారు.. పాఠశాలలు, కళాశాలలకు వెళ్లడానికి అనుకూల సమయాల్లో ఉండే బస్సు సర్వీసులు ప్రస్తుతం నిలిపివేయడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సైతం ఇబ్బం దులు పడుతున్నారు. గ్రామీణ ప్రాంత రూట్లలో ఆదాయం లేదని, రోడ్లు దెబ్బతినడంతో తరుచు బస్సులు మరమ్మతులకు గురవుతున్నాయని పల్లె వెలుగు సర్వీసులను కుదించేశారు. పల్లెలకు బస్సు సర్వీసులను నడపాలని ఆందోళన చేసినా, అధికారులు, ప్రజాప్రతినిధులకు విన్నవించుకున్నా పట్టిం చుకోవడం లేదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


ఎన్నిసార్లు విన్నవించినా స్పందించని అధికారులు

నిలిపివేసిన బస్సు సర్వీసులను పునరుద్ధరించాలని ఆర్టీసీ అధికారులకు ఎన్నిమార్లు వినతి పత్రాలు ఇచ్చినా స్పందన లేదు. అలివేరు నుంచి జంగారెడ్డిగూడెం, దొరమామిడి ప్రయాణ ఖర్చు రూ.20. ప్రస్తుతం రూ. 100 ఖర్చు అవుతుంది. ఇది పేదవాడికి కష్టంగా మారింది. ఆదివాసీల కష్టాలను గుర్తించి బస్సు సర్వీసులను నడపాలి.

కొవ్వాసి గోవిందరాజు, ఎంపీటీసీ, అంతర్వేదిగూడెం 


గ్రామీణ ప్రాంతాల వారికి ప్రయాణం భారం

పీఆర్‌.గూడెం నుంచి బుట్టాయగూడెం వెళ్లడానికి, అధికారులను కలవడానికి ప్రయాణానికే రూ.80 ఖర్చవుతుంది. అయినా సమయానికి చేరుకోగలమన నమ్మకం లేదు. ఆర్టీసీ బస్సులో వెళితే డబ్బుతోపాటు సమయం ఆదా అయ్యేది. బస్సులు ఎందుకు నిలుపుదల చేశారో అర్ధం కావడం లేదు. రోజులో రెండు సార్లు తిరిగే బస్సు నిండా ప్రయాణికులుండేవారు.

నాయక యశోద, పీఆర్‌.గూడెం, డ్వాక్రా సంఘం సభ్యురాలు

Updated Date - 2022-01-18T05:40:43+05:30 IST