ఆర్టీసీ బస్సు ఢీ.. ఇద్దరికి గాయాలు

ABN , First Publish Date - 2021-03-07T06:52:25+05:30 IST

స్థానిక పాత ఆంధ్రాబ్యాంక్‌ ఎదురుగా గల ప్రధాన రహదారిలో ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఇద్దరికి గాయాలయ్యాయి.

ఆర్టీసీ బస్సు ఢీ.. ఇద్దరికి గాయాలు

అంబాజీపేట, మార్చి 6: స్థానిక పాత ఆంధ్రాబ్యాంక్‌ ఎదురుగా  గల ప్రధాన రహదారిలో ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఇద్దరికి గాయాలయ్యాయి. పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం ఆయోధ్యలంకకు చెందిన లంకే మాణిక్యాలరావు తన మనమడితో కలిసి మోటార్‌సైకిల్‌పై అమలాపురం వైపు వెళ్తున్నాడు. ఈసమయంలో అమలాపురం నుంచి రాజమహేంద్రవరం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు మోటార్‌సైకిల్‌ను ఢీకొట్టింది. గాయపడ్డ  మాణిక్యాలరావు,  బాలుడిని  అమలాపురం ఆసుపత్రికి తరలించారు.  కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ షేక్‌ జానీబాషా తెలిపారు. 


జిల్లా స్థాయి వాలీబాల్‌ విజేత రామేశ్వరం

రాయవరం, మార్చి 6: రాయవరంలో జైభీమ్‌ యూత్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న అంబేద్కర్‌ మెమోరియల్‌ జిల్లాస్థాయి వాలీబాల్‌ పోటీలు శుక్రవారం అర్ధరాత్రితో ముగిశాయి. ఈనెల 1న ప్రారంభమైన వాలీబాల్‌ పోటీల్లో జిల్లాలో వివిధ ప్రాంతాలకు చెందిన 40జట్లు పాల్గొన్నాయి. సెమీఫైనల్‌కు రాజానగరం, కాతేరు, రామేశ్వరం, కామనగరువు జట్టు చేరుకోగా హోరాహోరీగా సాగిన పోరులో రామేశ్వరం-కామనగరువు జట్లు ఫైనల్‌కు చేరుకున్నాయి. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్‌ మ్యాచ్‌లో 2-1సెట్ల తేడాతో రామేశ్వరం జట్టు విజేతగా నిలించింది. అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో పారిశ్రామికవేత్త తేతలి సుబ్బిరామరెడ్డి, సర్పంచ్‌ చంద్రమళ్ల రామకృష్ణ మాట్లాడుతూ శారీరక ధారుడ్యం, మనసిక ఉల్లాసానికి క్రీడలు దోహదపడతాయన్నారు. విజేతగా నిలిచిన రామేశ్వరం జట్టుకు కప్‌ను రూ.15వేల నగదును, రన్నర్స్‌కు రూ.10వేల నగదు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో డాక్టర్‌ టి.నవీన్‌రెడ్డి, పడాల కమలారెడ్డి, టి.రామచంద్రారెడ్డి, వెలగల ఫణికృష్ణారెడ్డి, మాజీ సర్పంచ్‌ పాలింగి చిన్నబాబు, గంటి జాన్సన్‌, పోలిమాటి సుధాకర్‌ జైభీమ్‌ యూత్‌ సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-07T06:52:25+05:30 IST