కేరళలో ఆర్ఎస్ఎస్ కార్యకర్త నరికివేత

ABN , First Publish Date - 2022-04-16T21:20:04+05:30 IST

కేరళలోని పాలక్కాడ్‌ టౌన్‌లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) కార్యకర్త ఒకరిని ఒక వర్గం వారు..

కేరళలో ఆర్ఎస్ఎస్ కార్యకర్త నరికివేత

పాలక్కాడ్: కేరళలోని పాలక్కాడ్‌ టౌన్‌లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) కార్యకర్త ఒకరిని ఒక వర్గం వారు శనివారం మధ్యాహ్నం దారుణంగా నరకిచంపారు. పాలక్కాడ్ టౌన్‌లో షాపు నడుపుతున్న శ్రీనివాసన్ (45)‌ను అక్కడకు చేరుకున్న దుండగులు దాడి చేశారు. మోటార్ బైక్‌పై అగంతకులు వచ్చారని, తీవ్రంగా గాయపడిన శ్రీనివాసన్‌ను ఆసుపత్రికి తరలిస్తుండగానే కన్నుమూశాడని చెబుతున్నారు. పాలక్కాడుకు సమీపంలోని ఓ గ్రామంలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) నేతను చంపిన 24 గంటలు కూడా తిరక్కుండానే తాజా ఘటన చోటుచేసుకుంది. శుక్రవారం మధ్యాహ్నం మసీదులో ప్రార్థనలు ముగించుకుని ఇంటికి వస్తుండగా పీఎఫ్ఐ నేత సుభైర్ (43)ను దుండగులు ఎలప్పుల్లి వద్ద నరికిచంపారు. కాగా, శ్రీనివాసన్‌పై దాడి, హత్య వెనుక సోషల్ డెమోక్రాటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఉందని బీజేపీ ఆరోపించింది.

Updated Date - 2022-04-16T21:20:04+05:30 IST