ఆరెస్సెస్‌లోకి మహిళలను అనుమతించరు : రాహుల్ ఆరోపణ

ABN , First Publish Date - 2021-01-24T02:17:07+05:30 IST

తమిళనాడు వేదికగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. తమిళనాడు

ఆరెస్సెస్‌లోకి  మహిళలను అనుమతించరు : రాహుల్ ఆరోపణ

చెన్నై : తమిళనాడు వేదికగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. తమిళనాడు పర్యటనలో భాగంగా ఆయన తిరుప్పూర్‌లో రైతులతో సంభాషించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొదటి నుంచీ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ లో మహిళలపై తీవ్ర వివక్షత కొనసాగుతోందని విమర్శించారు. ఏ సంస్థ అయినా తమ కార్యకలాపాల్లోకి మహిళలను అనుమతించదంటే... ఆ సంస్థకు మహిళలపై గౌరవం లేదనే అర్థమని ఆయన వ్యాఖ్యానించారు. ఒకవేళ మహిళలను అమితంగా గౌరవిస్తే... సంస్థలో మహిళలకూ సమాన స్థాయిలో అవకాశాలు, స్థానం కల్పించాలని ఆయన అన్నారు. మహిళలకు సమాన స్థాయిలో అవకాశాలివ్వకుంటే ఏ దేశమూ పురోభివృద్ధి సాధించదని రాహుల్ పేర్కొన్నారు. నేడు భారత్‌ను ఓ స్థాయిలో నియంత్రిస్తున్న ఆరెస్సెస్ ఓ ఫాసిస్టు సంస్థ అని తీవ్రంగా ధ్వజమెత్తారు. ఆరెస్సెస్ ఓ పురుషాధిక్య సంస్థ అని, అందులోకి మహిళలను అనుమతించరని రాహుల్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 

Updated Date - 2021-01-24T02:17:07+05:30 IST