ఆర్‌ఎస్‌ఎస్‌కు గట్టి జవాబు కమ్యూనిస్టు మేనిఫెస్టో

ABN , First Publish Date - 2020-02-22T08:24:35+05:30 IST

దేశంలో మత రాజకీయాలు పెరుగుతున్నాయని, ఆర్‌ఎస్‌ఎస్‌కు కమ్యూనిస్టు మేనిఫెస్టో గట్టి జవాబని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు కె.నారాయణ అన్నారు. కార్ల్‌ మార్క్స్‌...

ఆర్‌ఎస్‌ఎస్‌కు గట్టి జవాబు కమ్యూనిస్టు మేనిఫెస్టో

రెడ్‌ బుక్‌ డే సందర్భంగా కమ్యూనిస్టులు



న్యూఢిల్లీ/హైదరాబాద్‌/రాంనగర్‌, ఫిబ్రవరి 21(ఆంధ్రజ్యోతి): దేశంలో మత రాజకీయాలు పెరుగుతున్నాయని, ఆర్‌ఎస్‌ఎస్‌కు కమ్యూనిస్టు మేనిఫెస్టో గట్టి జవాబని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు కె.నారాయణ అన్నారు. కార్ల్‌ మార్క్స్‌, ఏంగెల్స్‌ రచించిన ‘కమ్యూనిస్టు ప్రణాళిక’ విడుదలై 172 ఏళ్లైన సందర్భంగా దాని తెలుగు అనువాదాన్ని నారాయణ, సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ఢిల్లోలో శుక్రవారం ఆవిష్కరించారు. ఈ పుస్తకం చదివితే కమ్యూనిజం అర్థమవుతుందని రాఘవులు అన్నారు.  ఐద్వా నాయకురాలు పుణ్యావతి, సీపీఎం నేత వెంకట్‌ పాల్గొన్నారు. 


దోపిడీ శక్తులను తిప్పికొట్టడానికే కమ్యూనిజం

దోపిడీ శక్తులను తిప్పికొట్టడానికి కమ్యూనిజం అవసరమని వామపక్ష ప్రముఖులు పేర్కొన్నారు. రెడ్‌ బుక్‌ డే సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ‘కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక’ పుస్తకాన్ని ప్రముఖ కవి కె.శివారెడ్డి ఆవిష్కరించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ శ్రామికులను, పెట్టుబడిదారులను అధ్యయనం చేసి ఏంగెల్స్‌, మార్క్స్‌ ఈ మేనిఫెస్టో అందించారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇది సైద్ధాంతిక ఆయుధమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి తెలిపారు. ప్రజలను గెలిపించేవారే నిజమైన కమ్యూనిస్టులని సీపీఐ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి అన్నారు. ఎంసీపీఐ నాయకులు రవి, న్యూ డెమాక్రసీ నాయకుడు వెంకట్రామయ్య, సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యులు వేములపల్లి వెంకట్రామయ్య, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి సాధినేని వెంకటేశ్వరరావు, విప్లవ గాయని విమలక్క, ప్రముఖ ప్రజా వాగ్గేయకారుడు గోరటి వెంకన్న, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి, కందిమళ్ళ ప్రతాపరెడ్డి, వామపక్షాల నేతలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-02-22T08:24:35+05:30 IST