ముస్లిం, దళిత, స్త్రీ విరోధి ఆర్ఎస్ఎస్: దిగ్విజయ్ సింగ్

ABN , First Publish Date - 2022-01-10T20:12:34+05:30 IST

ఈ డేటాను దిగ్విజయ్ సింగ్ షేర్ చేస్తూ ‘‘వాళ్ల (ఆర్ఎస్ఎస్) లక్ష్యం కేవలం దళితులు, ముస్లింలు మాత్రమే కాదు. మహిళలపై కూడా విద్వేషం చూపిస్తూనే ఉంటారు. మహిళకు ఇంటి గోడలే సరిహద్దులని ఆర్ఎస్ఎస్ చీఫ్..

ముస్లిం, దళిత, స్త్రీ విరోధి ఆర్ఎస్ఎస్: దిగ్విజయ్ సింగ్

భోపాల్: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) కేవలం ముస్లింలకు దళితులకు మాత్రమే వ్యతిరేకం కాదని మహిళలకు కూడా వ్యతిరేకమని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ విమర్శించారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ చేసిన వ్యాఖ్యలే ఇందుకు ఉదాహారణ అని ఆయన అన్నారు. దేశంలో మహిళా జర్నలిస్ట్‌లపై సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న మాటల దాడికి సంబంధించిన డేటాను షేర్ చేస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.


జనవరి 1, 2021 నుంచి మే 31, 2021 మధ్య దేశంలోని కొంత మంది మహిళా జర్నలిస్ట్‌‌లను తిడుతూ సోషల్ మీడియా వేదికగా వచ్చిన ట్వీట్ల ఆధారంగా ఓ డేటాను విడుదల చేశారు. ఇందులో రాణా అయ్యూబ్, బర్ఖా దత్, నిధితి రజ్దాన్‌లపై ఎక్కువగా ట్వీట్లు వచ్చినట్లు డేటా పేర్కొంది. ఇక రోహిణి సింగ్, స్వాతి చతుర్వేది, సాగరిక ఘోష్, మనీషా పాండే, ఫాయే డిసౌజా, అర్ఫా ఖానుమ్ షెర్వాణీ, స్మిత ప్రకాష్‌లు కూడా ఉన్నారు.


ఈ డేటాను దిగ్విజయ్ సింగ్ షేర్ చేస్తూ ‘‘వాళ్ల (ఆర్ఎస్ఎస్) లక్ష్యం కేవలం దళితులు, ముస్లింలు మాత్రమే కాదు. మహిళలపై కూడా విద్వేషం చూపిస్తూనే ఉంటారు. మహిళకు ఇంటి గోడలే సరిహద్దులని ఆర్ఎస్ఎస్ చీఫ్ ఆ మధ్య డిక్లేర్ చేశారు’’ అని దిగ్విజయ్ ట్వీట్ చేశారు. దీనితో పాటు ‘‘మోహన్ భాగవత్ దీనిపై ఏమైనా చెప్తారా?’’ అని ప్రశ్నించారు.

Updated Date - 2022-01-10T20:12:34+05:30 IST