ఉబెర్ డ్రైవర్‌కు అండగా నెటిజన్లు.. విరాళాల వెల్లువ!

ABN , First Publish Date - 2021-03-11T21:48:41+05:30 IST

అమెరికన్ యువతుల చేతిలో అవమానానికి గురైన ఉబెర్ డ్రైవర్‌పై నెటిజన్లు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా అతనికి విరాళాలు అందిస్తున్నారు. విరాళాల రూపంలో ఇప్పటి వరకు రూ.38లక్షల వర

ఉబెర్ డ్రైవర్‌కు అండగా నెటిజన్లు.. విరాళాల వెల్లువ!

శాన్‌ఫ్రాన్సిస్కో: అమెరికన్ యువతుల చేతిలో అవమానానికి గురైన ఉబెర్ డ్రైవర్‌పై నెటిజన్లు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా అతనికి విరాళాలు అందిస్తున్నారు. విరాళాల రూపంలో ఇప్పటి వరకు రూ.38లక్షల వరకు పోగయ్యాయని ఓ ప్రకటనలో గోఫౌండ్‌మీ వెల్లడించింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. నేపాల్‌కు చెందిన సుభాకర్ ఖడ్కా శాన్‌ఫ్రాన్సిస్కోలో ఉబెర్ డ్రైవర్‌గా పని చేస్తున్నారు. ఈ నెల 7న అతని క్యాబ్‌ను ముగ్గురు అమెరికన్ యువతులు ఎక్కారు. ఈ ముగ్గురిలో ఒకరు మాస్క్ ధరించకపోవడంతో.. సదరు యువతిని మాస్క్ ధరించాల్సిందిగా సుభాకర్ ఖడ్కా కోరాడు.


దీంతో ఆ యువతులు రెచ్చిపోయారు. జాత్యహంకార వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగకుండా అతనిపై దగ్గడం, మొబైల్ ఫోన్‌ను లాక్కునేందుకు ప్రయత్నం చేశారు. ఈ దృశ్యాలన్నీ క్యాబ్‌లో ఉన్న కెమెరాలో రికార్డు అయ్యాయి. తాజాగా అవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో ఆన్‌లైన్‌లో విరాళాలను సేకరించే ‘గోఫండ్‌మీ’ సుభాకర్ ఖడ్కా‌కు అండగా నిలిచింది. విరాళాల కోసం పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు దాదాపు రూ. 38లక్షలను వరకు పోగయ్యాయని గోఫండ్‌మీ ఓ ప్రకనటలో పేర్కొంది. 


ఇదిలా ఉంటే.. ఈ వీడియో వైరల్ అవ్వడంతో దీనిపై ఉబెర్ స్పందించింది. సదరు యువతిపై బ్యాన్ విధించింది. ఈ క్రమంలో సదరు యువతి ఉబెర్‌పై దావా వేసేందుకు సిద్ధం అవుతున్నానని పేర్కొంటూ ఓ వీడియో సందేశాన్ని సోషల్ మీడియాలో విడుదల చేసింది. సుభాకర్ ఖడ్కా తమను క్యాబ్ నుంచి బలవంతంగా దించేయాలని ప్రయత్నించాడని ఆమె ఆరోపించారు. ప్రస్తుతం ఈ వీడియో కూడా నెట్టింట హల్‌చల్ చేస్తోంది.




Updated Date - 2021-03-11T21:48:41+05:30 IST