రూ.3.55 లక్షల కర్ణాటక మద్యం పట్టివేత

ABN , First Publish Date - 2022-10-07T06:18:42+05:30 IST

కర్ణాటక మద్యాన్ని విక్రయించడానికి సిద్ధంగా ఉంచిన ఇద్దరిని పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి మద్యం బాటిళ్లు, టెట్రా ప్యాకెట్లు, సాచెట్లను స్వాధీనం చేసుకున్నారు.

రూ.3.55 లక్షల కర్ణాటక మద్యం పట్టివేత
పట్టుకున్న మద్యం, నిందితులను మీడియాకు చూపిస్తున్న డీఎస్పీ సుధాకర్‌రెడ్డి

ఇద ్దరి అరెస్టు

చిత్తూరు, అక్టోబరు 6: కర్ణాటక మద్యాన్ని విక్రయించడానికి సిద్ధంగా ఉంచిన ఇద్దరిని పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి మద్యం బాటిళ్లు, టెట్రా ప్యాకెట్లు, సాచెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను గురువారం రెండో పట్టణ పోలీ్‌సస్టేషన్‌లో సీఐ యతీంద్రతో కలిసి డీఎస్పీ సుధాకర్‌రెడ్డి మీడియాకు వివరించారు. చిత్తూరు నగరం తేనబండలో బుధవారం కర్ణాటక మద్యాన్ని నిల్వ ఉంచి నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఎస్‌ఐలు లోకేష్‌, మల్లికార్జున తనిఖీలు చేపట్టారు. తేనబండకు చెందిన కార్తీక్‌ (36), విజయ్‌కుమార్‌(33), అనంద్‌(35) పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించారు. కార్తీక్‌, విజయ్‌కుమార్‌ను పట్టుకోగా ఆనంద్‌ పారిపోయాడు. వారిచ్చిన సమాచారం మేరకు సత్యమ్మ గుడి సమీపంలోని చెట్ల పొదల్లో  ఉన్న రూ.3.55 లక్షల విలువ చేసే 1,776 మద్యం బాటిళ్లు, టెట్రా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్‌కు తరలించారు. అక్రమ మద్యాన్ని పట్టుకోవడంలో విశేష కృషి చేసిన హెడ్‌కానిస్టేబుల్‌ వాసుదేవమందడి, కానిస్టేబుల్‌ జయచంద్ర, సుధీర్‌, కుమార్‌లను డీఎస్పీ అభినందించారు.


Updated Date - 2022-10-07T06:18:42+05:30 IST