ఒక్కో గోనె సంచికి రూ.20

ABN , First Publish Date - 2021-05-14T09:08:29+05:30 IST

రేషన్‌ సరఫరాకు వినియోగించిన గోనె సంచులను మళ్లీ వాడుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఒక్కో సంచికి రూ.20 ఽచొప్పున చెల్లించి, డీలర్ల నుంచి వెనక్కి తీసుకోవాలని పౌరసరఫరా

ఒక్కో గోనె సంచికి రూ.20

రేషన్‌ డీలర్ల నుంచి కొనుగోలు.. పౌరసరఫరాల శాఖ ఆదేశం 

అమరావతి, మే 13 (ఆంధ్రజ్యోతి): రేషన్‌ సరఫరాకు వినియోగించిన గోనె సంచులను మళ్లీ వాడుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఒక్కో సంచికి రూ.20 ఽచొప్పున చెల్లించి, డీలర్ల నుంచి వెనక్కి తీసుకోవాలని పౌరసరఫరాల శాఖ అధికారులను ఆదేశించింది. ప్రస్తుతం సంచికి రూ.16 ఇస్తుండగా, ఆ ధరకు తిరిగి ఇచ్చేందుకు డీలర్లు సుముఖత చూప డం లేదు. ధాన్యం సేకరణకు ఇబ్బంది కావడంతో ఒక్కో సంచికి రూ.4  పెంచి కొనుగోలు చేయాలని ఆ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయం వల్ల డీలర్ల నుంచి అవసరాలకు తగినట్టు గోనె సంచులను సేకరించుకోవచ్చని భావిస్తోంది. ప్రస్తుత రబీ, వచ్చే ఖరీఫ్‌ సీజన్లలో ధాన్యం సేకరణకు సరిపడ సంచులు అందుబాటులో ఉంచుకోవాలని అధికారులకు స్పష్టం చేసింది. 

Updated Date - 2021-05-14T09:08:29+05:30 IST