సౌదీ నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద 3.8కిలోల పసిడి పట్టివేత !

ABN , First Publish Date - 2020-09-18T13:22:38+05:30 IST

సౌదీ అరేబియా నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడిని తనిఖీ చేయగా లక్నో కస్టమ్స్ అధికారులకు ఏకంగా రూ. 2కోట్లు విలువ చేసే 3.8కిలోల బంగారం పట్టుబడింది.

సౌదీ నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద 3.8కిలోల పసిడి పట్టివేత !

లక్నో: సౌదీ అరేబియా నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడిని తనిఖీ చేయగా లక్నో కస్టమ్స్ అధికారులకు ఏకంగా రూ. 2కోట్లు విలువ చేసే 3.8కిలోల బంగారం పట్టుబడింది. లక్నోలోని చౌదరీ చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం ఈ ఘటన జరిగింది. రియాద్ నుంచి జీ8 6451 విమానంలో లక్నో వచ్చిన సదరు ప్రయాణికుడిని అనుమానంతో సోదా చేసిన కస్టమ్స్ అధికారులకు ఈ భారీ మొత్తంలో బంగారం దొరికింది. మొత్తం 33 గోల్డ్ బిస్కెట్లను(ఒక్కొ బిస్కెట్ బరువు 116.64గ్రాములు) ప్రయాణికుడి నుంచి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన మొత్తం గోల్డ్ 3,849.12 గ్రాములని, మార్కెట్‌లో దీని విలువ సుమారు రూ. 2 కోట్ల 9 లక్షల వరకు ఉంటుందని కస్టమ్స్ అధికారులు తెలియజేశారు. కాగా, నిందితుడు గోల్డ్ బిస్కెట్లను సెల్లోటేప్‌లో చుట్టి, అతని అండర్ గార్మెంట్‌లోని నల్ల రంగు పర్సులో దాచి తీసుకువచ్చినట్లు అధికారులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 


Updated Date - 2020-09-18T13:22:38+05:30 IST