గ్రామ పంచాయతీలకు రూ.101 కోటు

ABN , First Publish Date - 2020-03-29T11:08:19+05:30 IST

జిల్లాలోని 1069 గ్రామ పంచాయతీలకు 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.101 కోట్ల 24 లక్షల 72 వేల కోట్లు

గ్రామ పంచాయతీలకు  రూ.101 కోటు

ఆర్థిక సంఘం నిధుల విడుదల 

1069  గ్రామాలలో నిధుల గలగల

మంచినీటి పథకాలకు కేటాయింప్లు


(ఆంధ్రజ్యోతి- రాజమహేంద్రవరం): జిల్లాలోని 1069 గ్రామ పంచాయతీలకు 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.101 కోట్ల 24 లక్షల 72 వేల కోట్లు విడుదలయ్యాయి. ఇవి 2018-19 ఆర్థిక సంవత్పరానికి చెందిన రెండో విడత నిధులు. పంచాయతీ ఎన్నికలు జరగకపోయినా కేంద్రం ఈ నిధులను విడుదల చేసింది. చాలాకాలం తర్వాత గ్రామాల్లో ఢిల్లీ కాసులు గలగలలాడుతున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం ఆయా గ్రామ జనాభా, మంచినీటి ఫథకాల నిర్వహణను పరిగణనలోకి తీసుకుని ఆయా గ్రామాలకు నిధులు విడుదల చేసింది. 


ఈ గ్రాంటు నుంచి సీపీడబ్ల్యుఎస్‌ స్కీమ్‌ రూ.10 కోట్ల 09 లక్షల 11 వేల 630 కేటాయించారు. పంచాయతీలో ఒక్కో చేతి పంపు నిర్వహణకు రూ.1000 వంతున 8,974 చేతిపంపులకు రూ.89,74,000 కేటాయించారు. ఈ నిధులతో మంచినీటి నిర్వహణ, శానిటేషన్‌, రోడ్ల నిర్మాణం చేపట్టవచ్చు. ఇప్పటికే ఆయా గ్రామ పంచాయతీల అక్కౌంట్లలో నిధులు జమయ్యాయి.

Updated Date - 2020-03-29T11:08:19+05:30 IST