రూ. 300 కోట్లకు పైగా టోకరా

ABN , First Publish Date - 2021-04-13T05:48:33+05:30 IST

‘మీ వద్ద ఉన్న డబ్బు మా కంపెనీకి కట్టండి. నెలకు రూ. ఒక లక్షకు రూ. 30 వే లు చొప్పున చెల్లిస్తాం. పది నెలలు తరువాత అసలు మొ త్తం కూడా చెల్లిస్తాం’ అని నాగ్‌పూర్‌కు చెందిన ఓ ప్రైవేట్‌ కంపెనీ జిల్లాలో పలువురిని బురిడీ కొట్టించింది.

రూ. 300 కోట్లకు పైగా టోకరా
ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు సోమవారం అనంతపురం వచ్చిన బాధితులు


రూ. లక్షకు నెలకు రూ. 30 వేలు పది నెలలు ఇస్తామని బురిడీ 

వందల సంఖ్యలో బాధితులు 

కొందరు బాధితులు స్పందనలో ఎస్పీకి ఫిర్యాదు

అనంతపురం క్రైం, ఏప్రిల్‌ 12: ‘మీ వద్ద ఉన్న డబ్బు మా కంపెనీకి కట్టండి. నెలకు రూ. ఒక లక్షకు రూ. 30 వే లు చొప్పున చెల్లిస్తాం. పది నెలలు తరువాత అసలు మొ త్తం కూడా చెల్లిస్తాం’ అని నాగ్‌పూర్‌కు చెందిన ఓ ప్రైవేట్‌ కంపెనీ   జిల్లాలో పలువురిని బురిడీ కొట్టించింది. జిల్లాలోని పలు గ్రామాలకు చెందిన రైతులు, వ్యాపారులు, ప్రజలు, కొందరు ఉద్యోగుల నుంచి లక్షల్లో కట్టించుకుని సుమారు రూ. 300 కోట్లకు పైగా టోకరా వేశారు. విశ్వస నీయ సమాచారం మేరకు... జిల్లా కేంద్రానికి చెందిన సునీల్‌ ఆ కంపెనీకి ఎండీగా నాగ్‌పూర్‌లో పనిచేస్తున్నాడు. ధర్మవ రం మండలం చింతలపల్లి గ్రామానికి చెందిన మహేంద్ర చౌదరి, వసంతపురం గ్రామానికి చెందిన సుధాకర్‌నాయుడు కూడా ఆ కంపెనీ ఏజెంట్‌లుగా గత రెండేళ్లుగా పనిచేస్తున్నారు. సుధాకర్‌ నాయుడి అ క్కను మహేంద్ర చౌదరి వివాహాం చేసుకున్నాడు. ఆమె సంజీవపురం కస్తూ ర్బా స్కూల్లో సూపర్‌వైజర్‌గా పనిచేసేది. వీరిద్దరూ కలిసి ఆమెను ఉద్యోగం మాన్పించి ఏజెంట్‌గా చేర్పించారు. ఈ నేపథ్యంలో ముగ్గురు ఏజెంట్‌లు కలిసి వారి స్వగ్రామాలైన వసంతపురం, చింతలపల్లి గ్రామాలకు చెందిన కొంతమందితో 18 నెలల కిందట తాము పని చేసే కంపెనీలో డబ్బు పె ట్టాలని కోరారు. రూ. ఒక లక్షకు నెలకు రూ. 30 వేలు, పది నెలలు తరువా త కట్టిన అసలు మొత్తం వెనక్కి తిరిగి ఇస్తారని  అక్కడ ప్రజలను నమ్మించి లక్షలాది రూపాయలు కంపె నీకి కట్టించారు. కొన్ని నెలలు పాటు ఆ కంపెనీ నుంచి ప్రతినెలా వారి అ కౌంట్‌లో రూ. 30 వేలు జమ కావడం తో ఎవరికీ ఎలాంటి అనుమానం రా లేదు. అంతేకాక కంపెనీపై నమ్మకం మరింత పెరిగింది. ఇదే అదునుగా భా వించి ముగ్గురు ఏజెంట్‌లు గ్రామాలలో మరింత జోరుగా   ప్రచారం చేసి ప్రజ లను మరింతగా నమ్మించారు. అధిక డ బ్బులు వస్తాయి కదా..? అనే ఆశతో ఏమాత్రం ఆలో చించకుండా ఆ రెండు గ్రామాలకు చెం దిన 43 మంది (వ్యాపా రులు, ఉద్యో గులు, ప్రజలు, కొందరు పో లీసులు కూడా ఉన్నారు.) ఒక్కొక్కరు రూ. 5 లక్షలు, రూ.10 లక్షలు, రూ.15 లక్షలు, రూ. 20 లక్షలు. గ్రూపుగా చేరి రూ.25, లేదా రూ.30 లక్షలు చెప్పున చెల్లిం చారు. కొందరు బయట రూ.2 వడ్డీకి తెచ్చి మరీ చెల్లించారని తెలిసింది. అం దరూ కలిపి సుమారు రూ. 300 కో ట్లకు పైగా చెల్లించినట్లు బాధిత వర్గాల నుంచి తెలిసింది. అయితే కొన్ని నెలల నుంచి ఖాతాదారుల అకౌంట్‌లలో సొ మ్ము జమ కాకపోవడంతో వారంతా ఆందోళన చెందారు. అనుమానం వచ్చి ముగ్గురు ఏజెంట్‌ల ఇంటి వద్దకు ఈ ఏడాది జనవరి నెలలో వెళ్లారు.  ఆ సమయంలో వారు అక్కడ లేకపోవడం మరింత కలవర పెట్టింది. చివరకు వారి ఫోన్‌లు కూడా పనిచేయక పోవడంతో పాటు  ఆచూకీ లేకుండా పోయారు. దీంతో ఆయా గ్రామాలకు చెందిన కొందరు బాధితులు(కంపెనీ ఖాతాదారులు) నాగ్‌పూర్‌లోని కంపెనీ వద్దకు వెళ్లారు. ఈ ముగ్గురు ఏజెంట్‌లు కొన్ని నెలలుగా కంపెనీకి ఎలాంటి డబ్బులు చెల్లించలేదని, ఎలాంటి సమాచారం కూడా ఇవ్వకుండా వెళ్లిపోయారని చెప్పడంతో వారందరూ ఒక్కసారిగా షాక్‌ తిన్నారు. దీంతో మోసపోయామని భావించి ఆ రెండు గ్రామాలకు చెందిన 43 మంది బా ధితులు జిల్లా పోలీసు శాఖ కార్యాలయంలో సోమవారం జరిగిన స్పందన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సత్యఏసుబాబుకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. కాగా.. మోసపోయిన వారిలో కొందరు పోలీసులు, ఉద్యోగులు ఉండటం మరింత కలవరపెడుతోంది. వీరితో పాటు జిల్లా వ్యాప్తంగా వందల సంఖ్యలో ఖాతాదారులు ఉన్నట్లు తెలుస్తోంది.


Updated Date - 2021-04-13T05:48:33+05:30 IST