KCR ప్రభుత్వం యూనివర్సిటీలను పూర్తిగా నిర్వీర్యం చేసింది: RS Praveen Kumar

ABN , First Publish Date - 2022-07-16T17:33:53+05:30 IST

గరంలోని హోప్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ట్రిపుల్ ఐటీ(IIIT) విద్యార్థులను బీఎస్పీ అధ్యక్షుడు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) పరామర్శించారు.

KCR ప్రభుత్వం యూనివర్సిటీలను పూర్తిగా నిర్వీర్యం చేసింది: RS Praveen Kumar

నిజామాబాద్ : నగరంలోని హోప్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ట్రిపుల్ ఐటీ(IIIT) విద్యార్థులను బీఎస్పీ అధ్యక్షుడు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వం(KCR Government) పూర్తిగా యూనివర్సిటీలను నిర్వీర్యం చేస్తోందన్నారు. గతంలో కూడా ముఖ్యమంత్రికి లేఖ రాశామని.. అయినా పట్టించుకోవడం లేదన్నారు. విద్యార్థుల డిమాండ్లను అప్పుడు సిల్లీ డిమాండ్స్ అన్నారని.. ఇప్పుడు అర్థమైందా? అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. కళాశాలకు వైస్ ఛాన్స్‌లర్ లేరని.. కామన్ మెస్ ఉందన్నారు. అక్కడ అనేక ఇబ్బందులు ఉన్నాయన్నారు. విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. మెస్ నిర్వాహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. ప్రతిపక్షాలు కేసీఆర్‌తో ములాఖత్ అయ్యాయని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు.

Updated Date - 2022-07-16T17:33:53+05:30 IST