రూ. లక్ష డిపాజిట్‌తో... రూ. 27 లక్షలు...

ABN , First Publish Date - 2021-03-08T22:58:28+05:30 IST

రిస్క్ వద్దనుకుంటే... స్థిరాదాయ పెట్టుబడుల్లో పొదుపు చేయడం బెటర్. ఇది... అటువంటి పథకమే. ఇది ప్రభుత్వ పథకమే. ఇందులో రూ. లక్ష పెట్టుబడి పెడితే... పదిహేనేళ్ళ తర్వాత రూ.27 లక్షలు అందుతాయి. వివరాలివీ...

రూ.  లక్ష డిపాజిట్‌తో... రూ. 27 లక్షలు...

న్యూఢిల్లీ : రిస్క్ వద్దనుకుంటే... స్థిరాదాయ పెట్టుబడుల్లో పొదుపు చేయడం బెటర్. ఇది... అటువంటి పథకమే. ఇది ప్రభుత్వ పథకమే. ఇందులో రూ. లక్ష పెట్టుబడి పెడితే... పదిహేనేళ్ళ తర్వాత రూ.27 లక్షలు అందుతాయి. వివరాలివీ...


తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టి, అధిక మొత్తంలో రాబడిని పొందేందుకు అవకాశమున్న అద్భుతమైన పథకం... పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్((పీపీఎఫ్). ఈ పథకాన్ని కేంద్రం 1968 లో ప్రారంభించింది. గత 53 ఏళ్ళుగా  పెట్టుబడిదారులను ఆకర్షిస్తూ వస్తోన్న స్కీం. ఇక ఇది పొదుపు పథకం మాత్రమే కాదు... పన్ను ఆదా పథకం అని కూడా. ఇదో  దీర్ఘకాలిక పెట్టుబడి పథకం. ఇందులో  ప్రతీ ఏటా పెట్టుబడి పెట్టడం ద్వారా పన్ను మినహాయింపును  పొందొచ్చు. సథరం మెచ్యూరిటీ గడువు పూర్తయినప్పుడు... వచ్చే మొత్తం, వడ్డీ ఆదాయం రెండూ కూడా పన్నురహితమే. 


ప్రతి సంవత్సరం రూ. లక్ష డిపాజిట్ చేసుకుంటూ వెళితే, చివరలో రూ. 27 లక్షలు పొందొచ్చు. ప్రస్తుతం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌పై వడ్డీ రేటు 7.1 శాతంగా ఉంది. సంవత్సరంలో రూ. 500 నుంచి, గరిష్టంగా రూ. 1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకం గడువు 15 సంవత్సరాలు. ఒక పెట్టుబడిదారుడు ప్రతీ సంవత్సరం రూ.  లక్ష జమ చేయడం ప్రారంభిస్తే, ప్రస్తుత రేటు నుండి 15 సంవత్సరాల తరువాత, రూ. 27,12,139 అందుతాయి. ఇది పూర్తిగా పన్నురహితంగా ఉంటుంది. ఇందులో ప్రధాన మొత్తం రూ. 15 లక్షలు కాగా, వడ్డీ ఆదాయం రూ. 12,12,139. 


ఒకవేళ నెలకు రూ. 500 పెట్టుబడి పెడితే, 15 సంవత్సరాల తరువాత, రూ . 1,62,728 లభిస్తుంది. ప్రతీ నెలా రూ. వెయ్యి పెట్టుబడి పెడితే, 15 సంవత్సరాల తరువాత రూ. 3,25,457 లభిస్తాయి. ప్రతి సంవత్సరం రూ. 10 వేలు పెట్టుబడి పెడితే... రూ. 2,71,214 రూపాయలందుతాయి. 


Updated Date - 2021-03-08T22:58:28+05:30 IST