Advertisement
Advertisement
Abn logo
Advertisement

రూ. 20 లక్షలు ఖర్చవుతుంది..

పట్టాదారు పాసుపుస్తకం కోసం తహసీల్దార్‌ డిమాండ్‌

సోషల్‌ మీడియాలో వైరల్‌

చర్యలు తీసుకోవాలని ఆర్డీఓకు ప్రజాప్రతినిధుల వినతి

కదిరి, డిసెంబరు 3: రూ. కోట్లు విలువ చేసే భూమికి పట్టాదారు పాసు పుస్తకం కావాలంటే రూ. 20 లక్షలు ఖర్చవుతుందని తహసీల్దార్‌ మారుతి డి మాండ్‌ చేసిన ఫోన్‌ సంభాషణ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. పట్టణా నికి సమీపంలోని ఓ భూమికి పాసుపుస్తకం కోసం భూ యజమానుల తరపున గోపాలక్రిష్ణ అనే వ్యక్తి తహసీల్దార్‌కు ఫోన్‌ చేశాడు. అతనితో తహసీల్దార్‌ మాట లు ఇలా ఉన్నాయి. గోపాల్‌క్రిష్ణ పట్టాదారు పాసుపుస్తకం ఇవ్వాలంటే చాలా సమస్య ఉంది.. ఈ విషయం పై అధికారుల దృష్టికి వెళ్లింది.. దీనికి రూ. 20 లక్ష లు ఖర్చవుతుందని తెలిపాడు. ఉన్నతాధికారులు నా మాట బాగా ఇంటారు.. వా రు పేదలు అని చెప్పి పట్టాదారు పాసుపుస్తకం వచ్చేలా ఏర్పాటు చేస్తానని తెలి పాడు. ఆర్డీఓతో కూడా తలనొప్పి నేను పంపిన దాదాపు 70 ఫైల్స్‌కు పైగా పెండిం గ్‌లో పెట్టుకున్నాడు. ఇలా సమస్యలు చాలా ఉన్నాయి. పాసుపుస్తకం చేసేది నేనే కనుక ఏమొచ్చినా చూసుకుంటానని భరోసా ఇచ్చాడు. రెండు, మూడు రోజులు  తర్వాత కలెక్టర్‌ కార్యాలయంలో మీటింగ్‌ ఉందని, ఆ మీటింగ్‌లో వారు ఆవిషయం గురించి మాట్లాడితే తాను ఈ విషయాలు చెబుతానని తప్పకుండా చేయిస్తాన న్నాడు. వీరి సంభాషణలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో పట్టణంలో చర్చనీయాంశమైంది.

 తహసీల్దార్‌ను సస్పెండ్‌ చేయాలి..

 తహసీల్దార్‌ మారుతి అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని, అతన్ని వెంటనే సస్పెండ్‌ చేయాలని ప్రజా ప్రతినిధులు ఆర్డీఓ వెంకటరెడ్డికి శుక్రవారం వినతిపత్రం అందజేశారు. పట్టాదారు పాసుపుస్తకం కోసం రూ. 20 లక్షలు డిమాండ్‌ చేసినట్లు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోందని తెలిపారు. అదేవిఽ దఽంగా ఇంటి పట్టాల పంపిణీలో కూడా అక్రమాలకు పాల్పడ్డాడని పేర్కొన్నారు. ఇటువం టి అవినీతి తహసీల్దార్‌ను వెంటనే సస్పెండ్‌ చేయాలని వారు డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో మార్కె ట్‌యార్డు వైస్‌ చైర్మన్‌ మధుసూదన్‌రెడ్డి, కదిరి ఎంపీపీ తోట అమర్‌నాథ్‌రెడ్డి, సర్పంచు రాఘవేంద్ర, విశ్వనాథ్‌, ఎంపీటీసీ సభ్యు డు ఆనంద్‌ నాయక్‌, వైసీపీ నాయకులు మణికంఠ తదితరులు పాల్గొన్నారు. 


Advertisement
Advertisement