డప్పు కొట్టే వారికి రూ. ఐదు వేల పింఛన్‌ ఇవ్వాలి

ABN , First Publish Date - 2021-07-27T03:57:04+05:30 IST

డప్పులు, చెప్పులు కుట్టే వారికి రూ.ఐదు వేల పింఛన్‌ ఇవ్వాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

డప్పు కొట్టే వారికి రూ. ఐదు వేల పింఛన్‌ ఇవ్వాలి
మెదక్‌ తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట నిరసన తెలుపుతున్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌

బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్‌

మెదక్‌ అర్బన్‌, జూలై 26: డప్పులు, చెప్పులు కుట్టే వారికి రూ.ఐదు వేల పింఛన్‌ ఇవ్వాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సోమవారం బీజేపీ దళిత మోర్చా ఆధ్వర్యంలో మెదక్‌ తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సీఎం కేసీఆర్‌ హామీల అమల్లో పూర్తిగా విఫలమయ్యారన్నారు. డప్పులు, చెప్పులు కుట్టే వారితో పాటు కాటికాపరిలకు నెలకు రూ. ఐదు వేల పింఛన్‌ ఇవ్వాలన్నారు. అనంతరం తహసీల్దార్‌ కార్యాలయ సిబ్బందికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ యువ మోర్చా జిల్లా అధ్యక్షుడు సందీప్‌, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శివ, దళిత మోర్చా ప్రధాన కార్యదర్శి రాజు, మండల అధ్యక్షుడు ప్రభాకర్‌, పట్టణ అధ్యక్షుడు నాయిని ప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు.

సంగారెడ్డి అర్బన్‌ :  డప్పు, చెప్పులు కుట్టే వారికి పెన్షన్‌ ఇవ్వాలని బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు అశ్వంత్‌ డిమాండ్‌ చేశారు. సంగారెడ్డిలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి, నాయకులు జగన్‌, పవన్‌, చంద్రశేకర్‌, రమేశ్‌, ఎల్లయ్య, వినోద్‌ తదితరులు పాల్గొన్నారు. 

తూప్రాన్‌ (మనోహరాబాద్‌)/తూప్రాన్‌ : బీజేపీ దళిత మోర్చా పిలుపు మేరకు డప్పు, చెప్పు కళాకారులు, కాటికాపరులకు పింఛన్లు అందజేయాలని తహసీల్దార్‌కు బీజేపీ, దళిత మోర్చా నాయకులు వినతి పత్రం అందజేశారు. మనోహరాబాద్‌ మండల దళితమోర్చా అధ్యక్షుడు సాయిప్రదీప్‌ ఆఽధ్వర్యంలో తహసీల్దారు కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. ఆందోళనలో బీజేపీ మండలాధ్యక్షుడు నరేందర్‌చారి, దళిత మోర్చా అధ్యక్షుడు సాయిప్రదీప్‌, బీజేవైఎం జిల్లా కార్యదర్శి ఆజయ్‌కుమార్‌, ఉపాధ్యక్షుడు కిరణ్‌కుమార్‌, సాయిబాబా, వీరాచారి, శ్రీకాంత్‌, వెంకటేశ్‌, లక్ష్మణ్‌సింగ్‌, బాలకృష్ణ, హర్షప్రసాద్‌, హరిబాబు, సాయి, కార్తీక్‌ పాల్గొన్నారు. తూప్రాన్‌లో దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడు సంఖ్యా యాదగిరి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. డప్పు చప్పుళ్లతో ర్యాలీగా వెళ్లి తూప్రాన్‌ ఆర్డీవో కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. అనంతరం ఆర్డీవో కార్యాలయంలో డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేశారు. 

Updated Date - 2021-07-27T03:57:04+05:30 IST