ఎల్బీఐలో నైపుణ్య శిక్షణకు రూ.98.8లక్షలు

ABN , First Publish Date - 2021-04-17T07:03:46+05:30 IST

మహిళా యూనివర్సిటీలోని (ఎల్బీఐ) ద్వారా నైపుణ్య శిక్షణకు కేంద్ర ప్రభుత్వ చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ రూ.98.8 లక్షల మంజూరుకు ఆమోదం తెల్పింది.

ఎల్బీఐలో నైపుణ్య శిక్షణకు రూ.98.8లక్షలు
నిధుల ఆమోద పత్రాన్ని అందజేస్తున్న వీసీ జమున

తిరుపతి (విశ్వవిద్యాలయాలు), ఏప్రిల్‌ 16: పద్మావతి మహిళా యూనివర్సిటీలోని లైవ్లీ హుడ్‌ బిజినెస్‌ ఇన్‌క్యూబేటర్‌ సెంటర్‌ (ఎల్బీఐ) ద్వారా నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాల కల్పనకు కేంద్ర ప్రభుత్వ చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ రూ.98.8 లక్షల మంజూరుకు ఆమోదం తెల్పింది. ఇందుకు సంబంధించిన ఆమోద పత్రాన్ని ఎల్బీఐ కో-ఆర్డినేటర్‌ ప్రొఫెసర్‌ జీవన జ్యోతికి వర్సిటీ వీసీ జమున, రిజిస్ట్రార్‌ మమత అందజేసి, అభినందించారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఏపీతోపాటు సమీప రాష్ట్రాల్లోని యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వడంతోపాటు పరిశ్రమల స్థాపనకు ప్రోత్సహించడం, వ్యాపార అవకాశాలను కల్పించడం వంటి అంశాలపైనా అవగాహన కల్పిస్తారు. పలు రకాల ఉత్పత్తుల అమ్మకం, కన్సల్టెన్సీతోపాటు ఆగ్రో, ఫంక్షనల్‌, హెల్త్‌ ఫుడ్స్‌, ఫ్యాషన్‌ టెక్నాలజీ వంటి అంశాలకు సంబంధించిన కోర్సులను కూడా నిర్వహించనున్నారు. 

Updated Date - 2021-04-17T07:03:46+05:30 IST