రూ. 9.30 లక్షల కోట్లు... రానున్న ఆర్ధికె సంవత్సరంలో వడ్డీ భారం...

ABN , First Publish Date - 2022-01-28T00:05:50+05:30 IST

కేంద్రంపై వడ్డీ భారం వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి భారీగా పెరగనుంది.

రూ. 9.30 లక్షల కోట్లు... రానున్న ఆర్ధికె సంవత్సరంలో వడ్డీ భారం...

న్యూఢిల్లీ : కేంద్రంపై వడ్డీ భారం వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి భారీగా పెరగనుంది. కరోనా నేపథ్యంలో... ఇప్పటికే సామాన్యులకు అండగా నిలిచేందుకు ఉచిత రేషన్, ఉచిత గ్యాస్, వ్యాక్సినేషన్ తదితరాల కోసం పెద్దమొత్తంలో కేంద్రం వ్యయం చేసిన విషయం తెలిసిందే. అదే సమయంలో రాబడి తగ్గింది. దీంతో 2021-22 ఆర్థిక సంవత్సరంలో రుణాలు పెరిగాయి. ఇక... 2022-23 ఆర్థిక సంవత్సరానికి వడ్డీ భారం మరింత పెరగనుంది. ప్రస్తుత ఆర్థిక  సంవత్సరంలోని రూ. 8.1 లక్షల భారంలో మరో 20 శాతానికి పైగా పెరగవచ్చని అంచనా. మొత్తంమీద 2023 ఆర్ధిక సంవత్సరంలో వడ్డీ భారం రూ. 9. 30 లక్షల కోట్లకు చేరుకుంటుందని భావిస్తున్నారు. 

Updated Date - 2022-01-28T00:05:50+05:30 IST