రూ. 58 వేల కోట్లు... పండుగ సీజన్‌లో ‘ఆన్‌లైన్’ సేల్స్...

ABN , First Publish Date - 2020-12-01T00:20:02+05:30 IST

రూ. 58 వేల కోట్లు... పండుగ సీజన్‌లో ‘ఆన్‌లైన్’ సేల్స్...

రూ. 58 వేల కోట్లు... పండుగ సీజన్‌లో ‘ఆన్‌లైన్’ సేల్స్...

బెంగళూరు : ఇటీవలి కాలంలో ఆన్‌లైన్ అమ్మకాల్లో వాల్‌మార్ట్ నేతృత్వంలోని ఫ్లిప్‌కార్ట్ ‘విజేత’గా నిలిచింది. ఈ-కామర్స్ దిగ్గజాలు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ సంస్థలు అక్టోబరు-నవంబరు పండుగ కాలంలో అమ్మకాల్లో 90 శాతం వాటాను నమోదు చేశాయి. కన్సల్టింగ్ సంస్థ రెడ్‌సీర్ నివేదిక ప్రకారం ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ వాటా 66 శాతం.. ఈ ఏడాది పండుగ సీజన్‌లో గతేడాదితో పోలిస్తే కస్టమరు గ్రోత్ 88 శాతంగా ఉంది. ఈ ఏడాది అమ్మకాలు ప్రధానంగా టైర్ 2 నగరాల నుండి ఎక్కువగా ఉన్నాయి. నెల రోజుల అమ్మకాలు.. పండుగ నేపధ్యంలో ఈ-కామర్స్ అమ్మకాలు ఈ దఫా భారీగా నమోదయ్యాయి.


అక్టోబరు 15 నుండి నవంబరు 15 వరకు ఆన్‌లైన్ సంస్థల స్థూల విక్రయాలు దాదాపు రూ. 58 వేలకోట్లు(8.3 బిలియన్ డాలర్లు)గా ఉన్నట్లు రీసెర్చ్ సంస్థ ‘రెడ్ సీర్’ వెల్లడించింది. పండుగ సీజన్‌కు ముందు 7 బిలియన్ డాలర్లుగా ఉండొచ్చని అంచనా వేసింది. గత సంవత్సరం ఇదే కాలంలో ఆన్‌లైన్ షాపింగ్‌ రూ. 35వేల కోట్లు. గతేడాదితో పోలిస్తే అమ్మకాలు భారీగా పెరిగాయి. 'ది ఫెస్టివల్‌ ఆఫ్ ఫస్ట్స్' పేరుతో రెడ్‌సీర్ ఓ నివేదికను విడుదల చేసింది. ఇందులో ఈ ఏడాది సెప్టెంబరు నెలలో రూ. 22వేల కోట్ల మేరకు అమ్మకాలు జరిగినట్లు వెల్లడించింది.


పండుగ సీజన్‌లో అమ్మకాలు రెట్టింపయ్యాయి. కరోనా ప్రభావం నేపధ్యంలో... ఈ ఏడాది ‘పండుగ అమ్మకాలు’ బుల్లిష్‌గా ఉన్నాయని, తాము ఏడు బిలియన్ డాలర్ల మేర ఉంటాయని వేసిన అంచనాను అధిగమించాయని రెడ్‌సీర్ డైరెక్టర్ వెల్లడించారు. ఈ నేపధ్యంలో... కరోనా మహమ్మారి కారణంగా ఎక్కువమంది ఆన్‌లైన్ కొనుగోళ్ల వైపే మొగ్గుచూపినట్లు వెల్లడవుతోందన్నారు. మొబైల్ హిట్.... ఫ్యాషన్ ఫట్...  బ్రాండెడ్ కంపెనీలు, అమ్మకందారులు ఎక్కువ భాగం ‘ఆన్‌లైన్’ విక్రయాలపైనే దృష్టి సారించడం విశేషం. ప్రీ సేల్ అవేర్‌నెస్, విస్తృత ఎంపికల అవకాశం, సరఫరా గొలుసు పెరగడం వంటి వివిధ కారణాలు అమ్మకాలకు దోహదపడ్డాయన్నారు.


ఆన్‌లైన్ అమ్మకాల్లో మొబైల్ ఫోన్ల వాటా ఎక్కువగా ఉన్నట్లు వెల్లడైంది. హోమ్ డెకార్స్, ఫర్నీచర్, టుక్ ఓవర్ ఫ్యాషన్ అమ్మకాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. గతేడాదితో పోలిస్తే ఫ్యాషన్ అమ్మకాలు తగ్గడం గమనార్హం. మొత్తంమీద గతంలో ఎన్నడూ లేనంతగా... ‘ఆన్‌లైన్’ అమ్మకాలు రూ. 58 వేల కోట్లకు చేరుకోవడం విశేషం. కాగా... ఆన్‌లైన్ ద్వారా అమ్మకాలు ఈ స్థాయిలో కాకపోయినప్పటికీ... రానున్న రోజుల్లో కూడా ఇదే ఒరవడి కొనసాగిస్తాయని భావిస్తున్నారు. 

Updated Date - 2020-12-01T00:20:02+05:30 IST