Abn logo
Nov 26 2021 @ 04:15AM

కాపులకు రూ.5,700 కోట్లు: శేషగిరి

కాపుల సంక్షేమానికి గత రెండేళ్లలో ప్రభుత్వం రూ.5,700 కోట్లు విడుదల చేసిందని కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ అడపా శేషగిరి చెప్పారు. గురువారం విజయవాడలోని కార్పొరేషన్‌ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రెండేళ్లలో కాపునేస్తం పథకానికి రూ.980 కోట్లు, విద్యా దీవెన పథకానికి రూ.540కోట్లు, ఆసరాకు రూ.1370 కోట్లు, అమ్మఒడికి రూ.600 కోట్లు, పెన్షన్లకు రూ.1800 కోట్లు ఖర్చు చేశామన్నారు. గత ప్రభుత్వంలో విదేశీ విద్యకు వెళ్లిన విద్యార్థులకు సకాలంలో ఫీజులు చెల్లించకపోవడంపై విజిలెన్స్‌ విచారణ చేస్తున్నామని తెలిపారు.