Advertisement
Advertisement
Abn logo
Advertisement

గాయత్రి గోశాలకు రూ.50 వేల విరాళం

కర్నూలు (న్యూసిటీ/అగ్రికల్చర్‌), అక్టోబరు 26: నగర శివారులోని గాయత్రి సేవాసమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గాయత్రి గోశాలకు కర్నూలు ఎన్నారై ఫౌండేషన్‌ చైర్మన్‌, తానా మాజీ కార్యదర్శి పొట్లూరి రవి రూ.50 వేల విరాళం అందించారు. మౌర్యఇన్‌లోని టీజీవీ సంస్థల కార్యాలయంలో చైర్మన్‌ టీజీ భరత్‌కు మంగళవారం చెక్కును అందజేశారు. గోమాతను సేవించడం పూర్వజన్మ పుణ్యఫలంగా భావిస్తున్నట్లు పొట్లూరి రవి తెలిపారు. గోశాల నిర్వాహణ కోసం తన వంతు బాధ్యతగా ఈ సహయం చేసినట్లు ఆయన అన్నారు. ఒకేచోట వందలాది గోవులతో గోశాల నిర్వహించడం గొప్ప విషయమని అన్నారు. అనంతరం రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.  ముప్పా రాజశేఖర్‌, సందడి మధు, విజయ్‌ పాల్గొన్నారు. 


Advertisement
Advertisement