24 గంటల్లోపే ... ఒడిషాకు రూ.500కోట్లు

ABN , First Publish Date - 2020-05-23T23:33:35+05:30 IST

ఆంఫన్ తుపానుతో దెబ్బతిన్న ఒడిశాకు కేంద్ర హోంశాఖ రూ.500 కోట్లు విడుదల చేసింది.

24 గంటల్లోపే ... ఒడిషాకు రూ.500కోట్లు

న్యూఢిల్లీ: ఆంఫన్ తుపానుతో దెబ్బతిన్న ఒడిశాకు కేంద్ర హోంశాఖ రూ.500 కోట్లు విడుదల చేసింది. ప్రధాని మోదీ ప్రకటించిన 24 గంటల్లోపే కేంద్రం నుంచి సాయం అందడంపై ఒడిశా అధికారులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. 




ఆంఫన్ తుపాను వల్ల నష్టపోయిన పశ్చిమబెంగాల్‌, ఒడిశాకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం సాయం ప్రకటించిన విషయం తెలసిందే. బెంగాల్‌కు వెయ్యి కోట్ల రూపాయలు, ఒడిశాకు 500 కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించారు. తుపాను తీవ్రతను స్వయంగా తెలుసుకునేందుకు కేంద్ర మంత్రులు, సీఎం మమతాబెనర్జీతో కలిసి ఆయన పశ్చిమబెంగాల్‌లో ఏరియల్ సర్వే జరిపారు. ఆంఫన్ తుపాను కారణంగా తీవ్రంగా నష్టపోయిన బెంగాల్‌ను అన్ని విధాలా ఆదుకుంటామని మోదీ అన్నారు. అంతేగాక మృతుల కుటుంబాలకు రెండు లక్షల రూపాయలు, గాయపడిన వారికి 50 వేల రూపాయల సాయం ప్రకటించారు. 

Updated Date - 2020-05-23T23:33:35+05:30 IST