విండ్‌లాస్ ఐపీఓ లక్ష్యం... రూ. 400 కోట్లు

ABN , First Publish Date - 2021-08-04T20:21:39+05:30 IST

త్వరలో ఐపీఓ మార్కెట్‌లో ఎంట్రీ ఇవ్వను న్న విండ్‌లాస్ బయోటెక్ లిమిటెడ్... రూ. 400 కోట్ల సమీకరణను లక్ష్యంగా పెట్టుకుంది.

విండ్‌లాస్ ఐపీఓ లక్ష్యం... రూ. 400 కోట్లు

డెహ్రాడూన్ : త్వరలో ఐపీఓ మార్కెట్‌లో ఎంట్రీ ఇవ్వను న్న విండ్‌లాస్ బయోటెక్ లిమిటెడ్... రూ. 400 కోట్ల  సమీకరణను లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో... రూ. 165 కోట్ల తాజా ఇష్యూ షేర్లు కాగా, మిగిలిన మొత్తాన్ని ‘ఆఫర్ ఫర్ సేల్’ ద్వారా సేకరించనుంది. తాజా ఇష్యూ నుంచి వచ్చిన ఆదాయంలో కొంత భాగాన్ని వర్కింగ్ కేపిటల్‌క కింద వినియోగించుకోనుంది. ద్రవ  ఫైజర్ లిమిటెడ్, సనోఫీ ఇండియా లిమిటెడ్, జైడస్ కాడిలా హెల్త్‌కేర్ లిమిటెడ్, ఎమ్‌క్యుర్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్, ఎరిస్ లైఫ్‌సైన్సెస్ లిమిటెడ్, ఇంటాస్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్, సిస్టోపిక్ లాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి కంపెనీలకు విండ్‌లాస్ బయోటెక్ లిమిటెడ్ సరఫరా చేస్తుంది. కాగా... 1920-21 ఆర్థికసంవత్సరాల్లో విండ్‌లాస్ బయోటెక్ ఆదాయం, నిర్వహణ లాభం 18-19 % సీఏజీఆర్ వద్ద పెరిగింది. కాగా... ప్రస్తుతం సీడీఎంఓ తయారీదారులకు అవకాశాలు గణనీయంగా పెరుగుతున్నాయి. గత ఐదు సంవత్సరాలలో, భారతీయ ఫార్ములేషన్స్ సీడీఎం 8.6 % వృద్ధి రేటుతో 13 % చొప్పున పెరిగింది. 2021 ఆర్థిక సంవత్సరం వార్షిక ఆదాయాలను పరిగణనలోకి తీసుకుంటే ఇష్యూ ధర 64.4 రెట్లు పెరిగే అవకాశమున్నట్లు చెబుతున్నారు. 

Updated Date - 2021-08-04T20:21:39+05:30 IST