- భారీగా ఆవిరైన స్టాక్ మార్కెట్ సంపద
- సెన్సెక్స్ 554, నిఫ్టీ 195 పాయింట్లు పతనం
ముంబై: అమెరికా బాండ్ల వడ్డీ రేట్లతోపాటు ముడి చమురు ధరలు గణనీయంగా పెరగడంతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు బేర్మన్నాయి. దీంతో మంగళవారం దలాల్ స్ట్రీట్‌లోనూ ఆటో, మెటల్, రియల్టీ రంగ షేర్లలో అమ్మకాలు పోటెత్తాయి. దాం తో మన ప్రామాణిక సూచీలు ఒక శాతం మేర క్షీణించాయి. బీఎ్‌సఈ సెన్సెక్స్ 554.05 పాయింట్లు పతనమై 60,754.68 వద్దకు జారుకుంది. ఎన్‌ఎ్‌సఈ నిఫ్టీ 195.05 పాయింట్ల నష్టంతో 18,113.05 వద్ద క్లోజైంది.
సెన్సెక్స్‌లోని 30 లిస్టెడ్ కంపెనీల్లో 23 నేలచూపులు చూశాయి. మారుతి సుజుకీ అత్యధికంగా 4.22 శాతం క్షీణించింది. అలా్ట్రటెక్ సిమెంట్, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేర్లు 3 శాతానికి పైగా విలువను కోల్పోయాయి. యాక్సిస్ బ్యాంక్ మాత్రం 1.83 శాతం లాభంతో సూచీ టాప్ గెయినర్‌గా నిలిచింది. అమ్మకాల హోరులో రూ.3.78 లక్షల కోట్ల స్టాక్ మార్కెట్ సంపద ఆవిరైంది. దాంతో బీఎ్‌సఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.276.24 లక్షల కోట్లకు పడిపోయింది.