రూ.36 కోట్ల గ్రంథాలయ పన్ను బకాయిలు

ABN , First Publish Date - 2022-08-17T03:13:58+05:30 IST

ల్లాలో గ్రంథాలయ సంస్థకు సుమారు రూ. 36 కోట్ల పన్ను బకాయిలు వసూలు కావాల్సి ఉందని జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యద

రూ.36 కోట్ల గ్రంథాలయ పన్ను బకాయిలు
సంగం గ్రంథాలయంలో రికార్డులు తనిఖీ చేస్తున్న జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి కుమార్‌రాజా

- సంస్థ కార్యదర్శి కుమార్‌రాజా

సంంగం, ఆగస్టు 16: జిల్లాలో గ్రంథాలయ సంస్థకు సుమారు రూ. 36 కోట్ల పన్ను బకాయిలు వసూలు కావాల్సి ఉందని జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి కుమార్‌రాజా పేర్కొన్నారు. మంగళవారం ఆయన స్థానిక గ్రంథాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి, రికార్డులను పరిశీలించారు. అనంతరం గ్రంథాలయంలో జరిగిన దివంగత ప్రధాని వాజ్‌పేయి వర్థంతిలో పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళలు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇటీవల జిల్లా గ్రంథాలయ సంస్థ సుమారు రూ. 89 లక్షల విలువైన పుస్తకాలు కొనుగోలు చేసిందని తెలిపారు. వీటిని ఈ నెలాఖరుకు జిల్లాలోని 60 గ్రంథాలయాలకు పంపిణీ చేస్తామన్నారు. 36 గ్రంథాలయాలకు కంప్యూటర్స్‌, స్కానర్లు, జెరాక్‌ మిషన్లు, పింటర్లను సరఫరా చేశామని వివరించారు. సిబ్బంది కొరతపై ప్రభుత్వానికి నివేదిక అందచేశామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయాధికారి కె రవీంద్రనాథ్‌రెడ్డి, పాఠకులు, విద్యార్థులు పాల్గొన్నారు.


Updated Date - 2022-08-17T03:13:58+05:30 IST