Abn logo
Sep 21 2021 @ 00:23AM

రూ.3.5 లక్షల కోట్లు ఫట్‌

  •  సెన్సెక్స్‌ 525 పాయింట్లు డౌన్‌ 
  •  17,400 దిగువ స్థాయికి నిఫ్టీ 
  •  లోహ రంగ షేర్లు విలవిల
  •  అంతర్జాతీయ మార్కెట్లో   ప్రతికూల ట్రెండే కారణం  


ముంబై: అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో దేశీయ ఈక్విటీ సూచీలు భారీగా నష్టపోయాయి. దీంతో సోమవారం బీఎ్‌సఈ సెన్సెక్స్‌ 524.96 పాయింట్లు పతనమై 58,490.93 వద్ద ముగిసింది. ఎన్‌ఎ్‌సఈ నిఫ్టీ 188.25 పాయింట్లు క్షీణించి 17,396.90 వద్ద స్థిరపడింది. బ్లూచి్‌పలతోపాటు చిన్న, మధ్య స్థాయి కంపెనీల షేర్లూ అమ్మకాల ఒత్తిడినెదుర్కొన్నాయి. బీఎ స్‌ఈ మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ సూచీలు 1.84 శాతం వరకు నష్టపోయాయి. అమ్మకాల హోరులో స్టాక్‌ మార్కెట్‌ వర్గాల సంపద ఒక్కరోజులోనే రూ.3.49 లక్షల కోట్లు హరించుకుపోయింది. దాంతో బీఎ్‌సఈ లిస్టెడ్‌ కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ రూ.255.47 లక్షల కోట్లకు పరిమితమైంది.


అమెరికా, బ్రిటన్‌, జపాన్‌ సహా 16 దేశాల సెంట్రల్‌ బ్యాంక్‌లు ఈవారంలో సమావేశం కానున్నాయి. కరోనా సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు ప్రకటించిన ఉద్దీపనలను క్రమంగా ఉపసంహరించుకునే విషయంపై ఈ సమావేశాల్లో సంకేతాలివ్వవచ్చన్న అంచనాల నేపథ్యంలో గ్లోబల్‌ ఇన్వెస్టర్లు ముందుజాగ్రత్త పడ్డారు. ఇందుకు తోడు, చైనా రియల్‌ ఎస్టేట్‌ దిగ్గజం ఎవర్‌గ్రాండ్‌ దివాలా అంచున ఉందన్న వార్తల నేపథ్యంలో అంతర్జాతీయంగా కమోడిటీ ధరలు పతనమయ్యాయి. తత్ఫలితంగా అంతర్జాతీయంగా లోహ రంగ షేర్లు తీవ్ర ఒత్తిడికి లోనయ్యాయి.


రూపాయి క్షీణత కూడా ఈక్విటీ ట్రేడింగ్‌పై ప్రభావం చూపింది. సెన్సెక్స్‌లోని 30 లిస్టెడ్‌ కంపెనీల్లో ఏడు మినహా మిగ తా షేర్లన్నీ నష్టాలు చవిచూశాయి. టాటా స్టీల్‌ షేరు ఏకంగా 9.53 శాతం పతనమైంది. ఎస్‌బీఐ 3.69 శాతం, ఇండ్‌సఇండ్‌ బ్యాంక్‌ 3.5 శాతం క్షీణించగా.. హెచ్‌డీఎ్‌ఫసీ, డాక్టర్‌ రెడ్డీస్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, అలా్ట్రటెక్‌ సిమెంట్‌ 2 శాతానికి పైగా మార్కెట్‌ విలువను కోల్పోయాయి.



బీఎ్‌సఈలో లోహ రంగ షేర్ల పతనం (%)


టాటా స్టీల్‌ 9.53

జిందాల్‌ స్టీల్‌ 9.13

నాల్కో 8.92

సెయిల్‌ 8.20

ఎన్‌ఎండీసీ 7.70

జేఎ్‌సడబ్ల్యూ స్టీల్‌ 6.99

హిందాల్కో 6.07

వేదాంత 4.99

హిందుస్థాన్‌ జింక్‌ 3.33