మూడు ఆలయాలకు రూ.30 కోట్లు మంజూరు

ABN , First Publish Date - 2022-01-25T05:48:52+05:30 IST

సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ నియోజకవర్గంలోని వరదరాజస్వామి, కొండపోచమ్మ, నాచారం గుట్ట ఆలయాలకు రూ.30కోట్ల నిధులను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు విడుదల చేసినట్లు ఎమ్మెల్సీ వెంకట్రామారెడ్డి, కలెక్టర్‌ హన్మంతరావు, ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతా్‌పరెడ్డి తెలిపారు

మూడు ఆలయాలకు రూ.30 కోట్లు మంజూరు

వరదరాజపురం, కొండపోచమ్మ ఆలయాల పునర్నిర్మాణానికి రూ.10కోట్లు

నాచారంగుట్ట అభివృద్ధికి మరో రూ.10కోట్లు 

వర్గల్‌ సరస్వతీ ఆలయం వద్ద అభివృద్ధికి నిధుల మంజూరు 

వారం రోజుల్లో పునర్నిర్మాణం కోసం సమీక్ష  

ఎమ్మెల్సీ వెంకట్రామారెడ్డి, కలెక్టర్‌ హన్మంతరావు వెల్లడి


జగదేవ్‌పూర్‌, జనవరి 24: సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ నియోజకవర్గంలోని వరదరాజస్వామి, కొండపోచమ్మ, నాచారం గుట్ట ఆలయాలకు రూ.30కోట్ల నిధులను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు విడుదల చేసినట్లు ఎమ్మెల్సీ వెంకట్రామారెడ్డి, కలెక్టర్‌ హన్మంతరావు, ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతా్‌పరెడ్డి తెలిపారు. సోమవారం మర్కుక్‌ మండలం వరదరాజ్‌పూర్‌లో గల వరదరాజస్వామి ఆలయాన్ని సందర్శించారు. వరదరాజస్వామి ఆలయంలో చేపట్టాల్సిన పునర్నిర్మాణ పనులకు సంబంధించి గుడిని పరిశీలించారు. ఆలయమంతా కలియతిరుగుతూ చేపట్టాల్సిన పనులపై చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గజ్వేల్‌ నియోజకవర్గంలోని మర్కుక్‌ మండలం వరదరాజస్వామి, జగదేవపూర్‌ మండలం కొండపోచమ్మ ఆలయాల పున:నిర్మాణానికి రూ.20కోట్ల మంజూరు చేశామన్నారు. వర్గల్‌ మండలం నాచారం గుట్ట ఆలయాభివృద్ధికి మరో రూ.10కోట్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. వర్గల్‌లోని సరస్వతీ ఆలయాభివృద్ధికి సీఎం కేసీఆర్‌ నిధులు మంజూరుకు హామీ ఇచ్చారని పేర్కొన్నారు. మర్కుక్‌ మండలం వరదరాజ్‌పూర్‌, శివారు వెంకటాపూర్‌ గ్రామాల అభివృద్ధికి ఒక్కోగ్రామానికి 10కోట్ల చొప్పున నిదులను మం జూరు చేశామని తెలిపారు. ఈనిధులతో ఆయాగ్రామాల్లో సీసీ రోడ్లు, మురుగు కాలువల నిర్మాణం ఇతర అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వరదరాజ్‌పూర్‌ సర్పంచ్‌ అప్పాల ప్రవీణ్‌ కుమార్‌, శివారువెంకటాపూర్‌ సర్పంచ్‌ పుట్ట మంజులనర్సింహులు, కొండపోచమ్మ చైర్మన్‌ ఉపేందర్‌రెడ్డి, నాయకులు నరేష్‌, శ్రీశైలం, నర్సింహులు, అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-25T05:48:52+05:30 IST