రూ. 28 లక్షల గుట్కా పట్టివేత

ABN , First Publish Date - 2021-03-06T05:30:00+05:30 IST

రూ.28 లక్షల నిషేధిత గుట్కాను శనివారం పోలీసులు పట్టుకున్నారు. ఏఎస్పీ కారే కిరణ్‌ ప్రభాకర్‌ తెలిపిన వివరాల ప్రకారం ఐచర్‌ వాహనం లో అక్రమంగా గుట్కా తరలిస్తుండగా సిబ్బందితో కలిసి మొండిగుట్ట జాతీయ రహ దారిపై వాహనాలు ఆపి తనిఖీలు చేశారు.

రూ. 28 లక్షల గుట్కా పట్టివేత

మామడ, మార్చి 6 : రూ.28 లక్షల నిషేధిత గుట్కాను శనివారం పోలీసులు పట్టుకున్నారు. ఏఎస్పీ కారే కిరణ్‌ ప్రభాకర్‌ తెలిపిన వివరాల ప్రకారం ఐచర్‌ వాహనం లో అక్రమంగా గుట్కా తరలిస్తుండగా సిబ్బందితో కలిసి మొండిగుట్ట జాతీయ రహ దారిపై వాహనాలు ఆపి తనిఖీలు చేశారు. ఒక వాహనంలో 80 సంచుల నిషేధిత అంబర్‌ టొబాకో గుట్కా సంచులు ఉన్నాయి. డ్రైవర్‌ షేక్‌షబీర్‌ను అడుగగా బీదర్‌ నుంచి సరుకు తెస్తున్నామని, ఆదిలాబాద్‌ షమీఉల్లా చెందిన అస్లాం ట్రేడర్స్‌ షాప్‌కు చేరవేస్తున్నామని చెప్పాడు. అక్కడే పంచనామా నిర్వహించి గుట్కాసంచులు, డ్రైవర్‌తో పాటు వాహనాన్ని సీజ్‌ చేసి పోలీస్‌స్టేషన్‌ తరలించి వెహికిల్‌ ఓనర్‌ తబరేజ్‌ ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేశామని వాహనాన్ని సీజ్‌ చేసి కేసు నమోదు చేశామన్నారు. ఈ తనిఖీల్లో సీఐ జీవన్‌రెడ్డి, ఎస్సై వినయ్‌కుమార్‌, సీఐ జీవన్‌రెడ్డి, సిబ్బంది రవి, భూమన్న ఉన్నారన్నారు.

Updated Date - 2021-03-06T05:30:00+05:30 IST