రూ.250 అప్పు తీర్చలేదని..

ABN , First Publish Date - 2022-06-28T06:08:15+05:30 IST

తోటి స్నేహితుని రూ.250 అప్పు తీర్చలేదని దారుణంగా హత్య చేసిన సంఘటన మండలంలోని కలమల్ల పోలీసుస్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పి.గోపులాపురం గ్రామానికి చెందిన శ్రీనివాసులు (35) బేల్దారి పనిచేసుకుంటూ జీవిస్తున్నాడు. శ్రీనివాసులు,

రూ.250 అప్పు తీర్చలేదని..
సంఘటనా స్థలంలో పరిశీలిస్తున్న సీఐ,ఎ్‌సఐ

వ్యక్తి దారుణ హత్య

ఎర్రగుంట్ల, జూన్‌ 27: తోటి స్నేహితుని రూ.250 అప్పు తీర్చలేదని దారుణంగా హత్య చేసిన సంఘటన మండలంలోని కలమల్ల పోలీసుస్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పి.గోపులాపురం గ్రామానికి చెందిన శ్రీనివాసులు (35) బేల్దారి పనిచేసుకుంటూ జీవిస్తున్నాడు. శ్రీనివాసులు, శివ, గంగారం, కదీర్‌ స్నేహితులు. శివ వద్ద శ్రీనివాసులు రూ.250 అప్పుగా తీసుకున్నాడు. ఈవిషయమై ఆదివారం ఉదయం కలమల్ల వద్ద గొడవపడ్డారు. ఈ నేపథ్యంలో శ్రీనివాసులు ఆదివారం రాత్రంతా కనిపించలేదు. సోమవారం ఉదయం శ్రీనివాసులు ఆచూకీ కోసం అతని సోదరుడు నాగయ్య  వెతకగా శవమై కనిపించాడు. ఆదివారం గొడవ అనంతరం శ్రీనివాసులును ఆ ముగ్గురు స్నేహితులే పిల్చుకెళ్లారని... సున్నపురాళ్లపల్ల్లె వెళ్లే దారిలో గంగమ్మ దేవాలయం వద్దనున్న ఉప్పువంక సమీపంలో తాగి గొడవపడి హత్య చేశారని.. నాగయ్య కలమల్ల పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ముందుగా బండరాయితో కొట్టి మరణించిన అనంతరం పెట్రోలు పోసి కాల్చి చంపినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సంఘటనా స్థలాన్ని సీఐ రవీంద్రనాథ్‌రెడ్డి, ఎస్‌ఐ శివప్రసాద్‌లు సోమవారం ఉదయం పరిశీలించారు. ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు ఎస్‌ఐ శివప్రసాద్‌ తెలిపారు. సీఐ రవీంద్రనాథ్‌రెడ్డి కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రొద్దుటూరు ఆసుపత్రికి తరలించారు. 

Updated Date - 2022-06-28T06:08:15+05:30 IST