రూ. 2.13 లక్షల కోట్లు... ఈక్విటీల నుంచి... FPIల ఔట్‌ఫ్లో

ABN , First Publish Date - 2022-06-26T20:36:34+05:30 IST

ఈక్విటీల నుండి విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐలు) నికర ఔట్‌ఫ్లో... ఈ ఏడాది(2022 లో) రూ. 2.13 లక్షల కోట్లకు చేరుకుందని డిపాజిటరీలతో కూడిన డేటా వెల్లడించింది.

రూ. 2.13 లక్షల కోట్లు...  ఈక్విటీల నుంచి... FPIల ఔట్‌ఫ్లో

ముంబై : ఈక్విటీల నుండి విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐలు) నికర ఔట్‌ఫ్లో... ఈ ఏడాది(2022 లో) రూ. 2.13 లక్షల కోట్లకు చేరుకుందని డిపాజిటరీలతో కూడిన డేటా వెల్లడించింది. US ఫెడ్ సహా ఇతర ప్రధాన కేంద్ర బ్యాంకుల పాలసీ సాధారణీకరణ వివరాల మేరకు... అధిక చమురు ధరలు, అస్థిరమైన రూపాయితో పాటు, FPIలు అభివృద్ధి చెందుతున్న మార్కెట్ ఆస్తులకు దూరంగా ఉండే అవకాశం ఉందని, ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్, ఎస్ సెక్యూరిటీస్ లీడ్ అనలిస్ట్ హితేష్ జైన్ పేర్కొన్నారు.


యూఎస్‌లో బాండ్ ఈల్డ్‌ల గరిష్ట స్థాయి, ఫెడ్ రేట్ పెంపులకు ముగింపు పలికిన తర్వాత మాత్రమే ఎఫ్‌పీఐల ఇన్‌ఫ్లో తిరిగి ప్రారంభమవుతుంది. అంతేకాకుండా, డాలర్, బాండ్ రాబడుల పెరుగుదల ప్రస్తుత ట్రెండ్ కొనసాగితే ఎఫ్‌పిఐలు మరింత ఎక్కువగా విక్రయించే అవకాశముందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయకుమార్ తెలిపారు. డేటా ప్రకారం... జూన్‌లో(24వ తేదీ వరకు) విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీల నుంచి రూ. 45,841 కోట్ల నికర మొత్తాన్ని ఉపసంహరించుకున్నారు. నిరుడు అక్టోబరు నుండి భారతీయ ఈక్విటీల నుండి పెద్దఎత్తున ఉపసంహరణలు జరగడంతోపాటు FPIల భారీ విక్రయాలు కూడా జూన్‌లో కొనసాగాయి. ‘ఆర్‌బీఐ ద్రవ్యవిధానాన్ని కఠినతరం చేయడం, పెరిగిన గ్లోబల్ కమోడిటీ ధరలు గత కొన్ని నెలల్లో ఈక్విటీ మార్కెట్ల నుండి గణనీయమైన నగదు ప్రవాహాలపరంగా దేశీయ మార్కెట్‌లను అతలాకుతలం చేయడానికి దారితీశాయి’ అని BDO ఇండియాలోని పార్టనర్ & లీడర్ ఫైనాన్షియల్ సర్వీసెస్ టాక్స్ మనోజ్ పురోహిత్ పేర్కొన్నారు. ఈ తరహా ఉపసంహరణల వేగం చివరిగా 2020 మొదటి త్రైమాసికంలో కరోనా ఉధృతి నేపథ్యంలో చోటుచేసుకుంది. ఉక్రెయిన్-రష్యా వివాదం, పెరుగుతున్న ఫెడ్ రేట్లు, కోవిడ్ వ్యాప్తి ఆజ్యం పోశాయని పురోహిత్ పేర్కొన్నారు. భారత్‌ సహా తైవాన్, దక్షిణ కొరియా, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, థాయిలాండ్ తదితర అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో FPI ల విక్రయం భారీగా కొనసాగుతోంది. 

Updated Date - 2022-06-26T20:36:34+05:30 IST