దేశ పౌరులు, నివాసితులకు సౌదీ వార్నింగ్.. ఆ నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.20వేల ఫైన్!

ABN , First Publish Date - 2022-01-07T18:54:49+05:30 IST

కరోనా కేసులు మళ్లీ అంతకంతకు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో దేశ పౌరులు, నివాసితులను సౌదీ అరేబియా అంతర్గత మంత్రిత్వశాఖ హెచ్చరించింది.

దేశ పౌరులు, నివాసితులకు సౌదీ వార్నింగ్.. ఆ నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.20వేల ఫైన్!

రియాద్: కరోనా కేసులు మళ్లీ అంతకంతకు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో దేశ పౌరులు, నివాసితులను సౌదీ అరేబియా అంతర్గత మంత్రిత్వశాఖ హెచ్చరించింది. ప్రతి ఒక్కరూ బహిరంగ ప్రదేశాల్లో సామాజిక దూరం, మాస్క్ ధరించడం, ఎప్పటికప్పుడు శరీర ఉష్ణోగ్రతలను చెక్ చేసుకోవడం లాంటి కరోనా నిబంధనలను పాటించడం తప్పనిసరి అని పేర్కొంది. ఒకవేళ నిబంధనలను ఉల్లంఘిస్తే వెయ్యి సౌదీ రియాల్(సుమారు రూ.20వేలు) జరిమానా విధించడం జరుగుతుందని మంత్రిత్వశాఖ వార్నింగ్ ఇచ్చింది. రెండోసారి కూడా మళ్లీ అవే ఉల్లంఘనలతో పట్టుబడితే జరిమానా రెట్టింపు అవుతుందని సంబంధిత అధికారులు వెల్లడించారు. ఇలా గరిష్టంగా రూ.19లక్షల వరకు ఫైన్ వేసే అవకాశం ఉందని స్పష్టం చేశారు. అలాగే ఆ దేశ ఆరోగ్యమంత్రిత్వ శాఖ బుధవారం కరోనా బాధితుల విషయమై కీలక ప్రకటన చేసింది. వైరస్ బారిన పడ్డ వారు పూర్తిగా కోలుకునే సమయం ఇంతకుముందు 14 రోజులుగా ఉండేది. దాన్ని మంత్రిత్వశాఖ తాజాగా తగ్గించింది. ఈ సమయాన్ని టీకా తీసుకున్న వారికి 7 రోజులుగా, వేసుకోని వారికి 10 రోజులుగా నిర్ణయించింది.    

Updated Date - 2022-01-07T18:54:49+05:30 IST