Abn logo
Feb 13 2020 @ 20:50PM

ఐటీ దాడుల్లో రూ. 2 వేల కోట్ల అక్రమాస్తులు గుర్తింపు...

న్యూఢిల్లీ : తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన ఆదాయపన్ను శాఖ దాడుల్లో రూ. 2 వేల కోట్ల విలువైన ఆదాయానికి మించిన ఆస్తులను గుర్తించినట్టు ఐటీ శాఖ వెల్లడించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.


హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, ఢిల్లీ, కడప, పూణే సహా మొత్తం 40 చోట్ల ఐటీ సోదాలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని మూడు ప్రముఖ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ 


కంపెనీల కార్యాలయాలు, కొందరు అధినేతల ఇళ్ళు కూడా వాటిలో ఉన్నాయి. ఈ క్రమంలో... అధిక బిల్లులు, బోగస్ బిల్లులతో బోగస్ సబ్ కాంట్రాక్టుల ద్వారా భారీ ఎత్తున నగదు లావాదేవీలు జరిపిన రాకెట్ గుట్టు రట్టయింది. ఓ ప్రముఖుడికి వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన వ్యక్తి మీద కూడా ఐటీ దాడులు జరిగాయి. ‘ఆయనకు వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాలు లభ్యమయ్యాయి.’ అని ఐటీ శాఖ తన ప్రకటనలో పేర్కొంది.


ఆ ఇన్ ఫ్రా కంపెనీలు కొన్ని పనులను ఇతర కంపెనీలకు సబ్ కాంట్రాక్ట్‌కు ఇచ్చినట్టు చూపించాయని, అయితే, అసలు ఆ సబ్ కాంట్రాక్ట్ ఇచ్చిన కంపెనీలే లేవని


తేలినట్టు ఐటీశాఖ తెలిపింది. ఇప్పటి వరకు లభించిన ఆధారాల మేరకు... సుమారు రూ. 2 వేల కోట్లకు పైగా అక్రమాలకు పాల్పడినట్టు ఐటీ శాఖ గుర్తించింది. వేసిన బిల్లులనే మళ్లీ మళ్లీ వేస్తూ... రూ. 2 కోట్ల కంటే తక్కువ పనులుగా చూపిస్తూ(బిల్లు పుస్తకాలు అవసరం లేని విధంగా, ఆడిటింగ్ నుంచి తప్పించుకోవడానికి)అక్రమాలకు పాల్పడినట్టు సందేహం వ్యక్తం చేసింది. అయితే, ఆ పుస్తకాల్లో చేసిన ఎంట్రీల్లోని కంపెనీలను పరిశీలిస్తే... అసలు ఆ కంపెనీలు పేర్కొన్న చిరునామాల్లో లేవని, ఉన్నా అవి డొల్ల కంపెనీలేనని ఐటీ శాఖ ఓ నిర్ధారణకు వచ్చింది.

Advertisement
Advertisement
Advertisement