2,000 రూపాయలు, 25 కిలోల సన్న బియ్యం

ABN , First Publish Date - 2021-04-09T22:10:20+05:30 IST

రాష్ట్రంలో పాఠశాలల మూసివేతతో ఇబ్బంది పడుతున్న ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులకు సీఎం

2,000 రూపాయలు, 25 కిలోల సన్న బియ్యం

హైదరాబాద్: రాష్ట్రంలో పాఠశాలల మూసివేతతో ఇబ్బంది పడుతున్న ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులకు సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు సహాయం అందిస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.  ప్రైవేట్ ఉపాధ్యాయులకు అందజేసే సహాయంపై బీఎర్కే భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశం ముగిసింది. అనంతరం మంత్రి వివరాలు వెల్లడించారు. స్కూల్స్ ఓపెన్ అయ్యేవరకు ప్రతి నెలా 2,000 రూపాయలు, 25 కిలోల సన్న బియ్యాన్ని ప్రతి ఉపాధ్యాయుడికి అందిస్తామని ఆయన ప్రకటించారు.


రాష్ట్రంలో ఎవరూ కూడా అర్ధాకలితో ఉండకూడదనే కారణంతోనే సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన తెలిపారు. వీరికి అందించే సహాయాన్ని45 రోజుల్లోనే  పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని ఆయన పేర్కొన్నారు. ఉపాధ్యాయులు, సిబ్బందికి సంబంధించిన డాటాను ప్రభుత్వం తెప్పించుకుంటుందని మంత్రి కమలాకర్ తెలిపారు. 

Updated Date - 2021-04-09T22:10:20+05:30 IST