Advertisement
Advertisement
Abn logo
Advertisement

₹1,200 కోట్ల ఐపీఓ ప్లాన్‌లో... గోల్డ్ ప్లస్ గ్లాస్

బెంగళూరు : ప్రేమ్‌జీ ఇన్వెస్ట్‌'కు పెట్టుబడులున్న  గోల్డ్ ప్లస్ గ్లాస్ ఐపీవోకు రానుంది. ప్రాథమిక మార్కెట్‌ నుంచి ₹ 1,200 కోట్ల వరకు సమీకరించాలని యోచిస్తోంది. ఈ డబ్బుతో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవాలని కంపెనీ భావిస్తోంది. జెఫెరీస్, యాక్సిస్ సెక్యూరిటీస్‌ సహా దాదాపు అర డజను సంస్థలను ఐపీఓ బ్యాంకర్లుగా కంపెనీ నియమించింది.


డిసెంబరు లేదా జనవరి నాటికి డీఆర్‌హెచ్‌పీ దాఖలు చేసి, రానున్న క్యాలెండర్ ఇయర్‌ ప్రారంభంలో షేర్ల విక్రయాలను ప్రారంభించే సూచనలు కనిపిస్తున్నాయి. కర్ణాటకలో ఒక సోలార్ గ్లాస్, రెండు ఫ్లోట్ గ్లాస్ ప్రొడక్షన్ లైన్లు సహా మూడు ప్రొడక్షన్‌ లైన్లను ఈ పరిశ్రమ ఏర్పాటు చేస్తోంది. ఈ మూడు ఎడిషన్స్‌ కలిసి రోజుకు 1,900 టన్నుల అదనపు ఉత్పత్తి సామర్థ్యాన్ని జోడించే అవకాశముంది. సంస్థకున్న ప్రస్తుత ప్రొడక్షన్‌ లైన్లు రోజుకు సుమారు 1,250 టన్నులను ఉత్పత్తి చేస్తాయి.

Advertisement
Advertisement