కరోనా మృతులకు రూ.10 లక్షలు ఇవ్వాలి

ABN , First Publish Date - 2021-06-17T05:05:17+05:30 IST

కరోనాతో మృతిచెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని టీడీపీ పార్లమెంటరీ మహిళా అధ్యక్షురాలు సువ్వాడ వనజాక్షి డిమాండ్‌ చేశారు. స్థానిక తహసీల్దార్‌ను కలిసి బుధవారం ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మాట్లాడుతూ, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే వైరస్‌ విజృంభించి వేలాదిమంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు.

కరోనా మృతులకు రూ.10 లక్షలు ఇవ్వాలి
వినతిపత్రం ఇస్తున్న దృశ్యం

టీడీపీ పార్లమెంటరీ మహిళా అధ్యక్షురాలు వనజాక్షి

నెల్లిమర్ల, జూన్‌ 16:  కరోనాతో మృతిచెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని టీడీపీ పార్లమెంటరీ మహిళా అధ్యక్షురాలు సువ్వాడ వనజాక్షి డిమాండ్‌ చేశారు.  స్థానిక తహసీల్దార్‌ను కలిసి బుధవారం ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మాట్లాడుతూ, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే వైరస్‌ విజృంభించి వేలాదిమంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. ఆక్సిజన్‌ అందక ఎంతోమంది చనిపోయారని, వాటికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. ఎంతోమంది పేదలు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారని, తెల్లరేషన్‌కార్డు ఉన్న ప్రయివేటు ఉపాధ్యాయులు, భవన నిర్మాణ కార్మికులు, వృత్తిదారుల కుటుంబాలకు రూ.10 వేల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కరోనాతో వ్యవసాయ రంగం కుదేలైందని, వ్యవసాయ ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలుచేసి రైతులను ఆదుకోవాలన్నారు. కరోనా మృతుల అంత్యక్రియలకు రూ.15 వేలు ఇస్తామని ప్రభుత్వమే ప్రకటించిందని... ఆ సాయాన్ని వెంటనే సంబంధిత కుటుంబాలకు ఇవ్వాలని కోరారు.  వినతిపత్రం అందజేసిన వారిలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి గేదెల రాజారావు, టీడీపీ సీనియర్‌ నాయకులు పతివాడ తమ్మినాయుడు, సువ్వాడ రవిశేఖర్‌, నియోజకవర్గ కార్యదర్శి లెంక అప్పలనాయుడు, నాయకులు గురాన అసిరి నాయుడు, పోతల రాజప్పన్న, మహంతి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2021-06-17T05:05:17+05:30 IST