విరాళాన్ని అందజేస్తున్న హరినాథ్, లావణ్య
తిరుమల, జనవరి21(ఆంధ్రజ్యోతి): శ్రీవారి నిత్యాన్నప్రసాదం ట్రస్టుకు శుక్రవారం రూ.10లక్షలు విరాళంగా అందింది. విశాఖపట్నానికి చెందిన హరినాథ్, లావణ్య ఈ విరాళమిచ్చారు. శుక్రవారం తిరుమలలోని దాతల విభాగంలో అధికారులకు ఈ మొత్తానికి సంబంధించిన చెక్‌ను అందజేశారు.