రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలి

ABN , First Publish Date - 2021-06-22T05:33:59+05:30 IST

జిల్లాలో కొవిడ్‌తో మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని ప్రతిపక్ష నాయకులు డిమాండ్‌ చేశారు. కలెక్టరేట్‌ వద్ద సోమవారం జేసీ మహేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందించారు. అనంతరం మాట్లాడుతూ జిల్లాలో ఆక్సిజన్‌ కొరత వల్ల చాలా మంది మృతిచెందారని, అవి ప్రభుత్వ హత్యలుగా భావిస్తున్నామన్నారు.

రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలి
నిరసన వ్యక్తం చేస్తున్న నాయకులు

కొవిడ్‌తో మృతిచెందిన కుటుంబాలను ఆదుకోవాలి

ప్రతిపక్ష నాయకుల డిమాండ్‌ 

కలెక్టరేట్‌, జూన్‌ 21 : జిల్లాలో కొవిడ్‌తో మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని ప్రతిపక్ష నాయకులు డిమాండ్‌ చేశారు. కలెక్టరేట్‌ వద్ద సోమవారం జేసీ మహేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందించారు. అనంతరం మాట్లాడుతూ జిల్లాలో ఆక్సిజన్‌ కొరత వల్ల చాలా మంది మృతిచెందారని, అవి ప్రభుత్వ హత్యలుగా భావిస్తున్నామన్నారు. ఆ కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. జర్నలిస్టులను ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌గా గుర్తించి వారికి రూ.50 లక్షల బీమా మంజూరు చేయాలని కోరారు. ప్రభుత్వం వెంటనే ఈ సమస్యలును పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో మరింతగా పోరాటం చేస్తామన్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నుంచి కిమిడి నాగార్జున, ఐవీపీ రాజు, సీపీఐ నుంచి బుగత ఆశోక్‌ తదితరులు ఉన్నారు.


Updated Date - 2021-06-22T05:33:59+05:30 IST