నియోజకవర్గానికి రూ. 10 కోట్ల అదనపు నిధులు

ABN , First Publish Date - 2020-09-30T16:30:29+05:30 IST

పాధి హామీ మెటీరియల్‌ కోటా కింద నియోజకవర్గానికి రూ. 10 కోట్లు..

నియోజకవర్గానికి రూ. 10 కోట్ల అదనపు నిధులు

ఉపాధి హామీ మెటీరియల్‌ కోటా కింద కేటాయింపు 

సీసీరోడ్లు, డ్రైన్ల నిర్మాణం పనుల గుర్తింపులో డ్వామా అధికారులు

ప్రకృతి సేద్యానికీ ఊతం


ఒంగోలు(ఆంధ్రజ్యోతి): ఉపాధి హామీ మెటీరియల్‌ కోటా కింద నియోజకవర్గానికి రూ. 10 కోట్లు మంజూరయ్యాయి. ఇప్పటికే జరుగుతున్న పనులకు అదనంగా ప్రభుత్వం వీటిని కేటాయించింది. ఈ నిధులతో కేవలం సిమెంటు రోడ్లు, డ్రైన్ల పనులను మాత్రమే చేపట్టాల్సి ఉంది. ఆ మేరకు తక్షణం పనులు గుర్తించి వెంటనే ప్రారంభించాలన్న ఆదేశాలు ప్రభుత్వం నుంచి వచ్చాయి. దీంతో డ్వామా అధికారులు ఆ వైపు దృష్టి సారించారు. పనుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. చీరాల నియోజకవర్గ పరిధిలో చేపట్టాల్సిన పనులపై ఇక్కడి డ్వామా కార్యాలయంలో మంగళవారం సమీక్ష జరిగింది. చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి, డ్వామా పీడీ శీనారెడ్డి పాల్గొన్నారు.


ఇతర నియోజకవర్గాల్లోనూ రెండు రోజుల్లో పనులను ఎంపిక చేసే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా ప్రకృతి సేద్యానికి ఉపాధి పథకం ఊతం కానుంది. ఆ పంటల సాగుకు మెటీరియల్‌ నిధులు ఇవ్వనున్నారు. జిల్లాలో ప్రస్తు తం 347 గ్రామాల్లో ప్రకృతి సేద్యం జరుగుతోంది. దీన్ని మరింత పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఒంగోలు సమీపంలోని అగ్రహారం వద్ద ప్రకృతి సేద్యం కింద సాగులో ఉన్న పంటలను మంగళవారం డ్వామా పీడీ శీనారెడ్డి, అదనపు పీడీ వెంకట్రామిరెడ్డి, వ్యవసాయశాఖ రూరల్‌ ఏడీ సుభాషిణి తదితరులు పరిశీలించారు. 

Updated Date - 2020-09-30T16:30:29+05:30 IST