రూ.1.54 లక్షల కోట్లు

ABN , First Publish Date - 2021-03-09T07:06:27+05:30 IST

జాతీయ స్థాయి వృద్ధిరేటుతో పోలిస్తే హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్‌ పరిశ్రమ వృద్ధిరేటు రెట్టింపు ఉంది. కొవిడ్‌ అనంతరం దేశ వ్యాప్తం గా ఊహించిన దానికంటే వేగంగా సాఫ్ట్‌వేర్‌ పరిశ్రమ రికవరీ అవుతోందని హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్‌

రూ.1.54 లక్షల కోట్లు

2021-22 తెలంగాణ ఐటీ పరిశ్రమ ఆదాయంపై హైసియా అంచనా

30 వేల ఉద్యోగాలు

మొత్తం ఉద్యోగాల్లో ‘డిజిటల్‌’ వాటా 25%

హైసియా ప్రెసిడెంట్‌ భరణి కె అరోల్‌


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): జాతీయ స్థాయి వృద్ధిరేటుతో పోలిస్తే హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్‌ పరిశ్రమ వృద్ధిరేటు రెట్టింపు ఉంది. కొవిడ్‌ అనంతరం దేశ వ్యాప్తం గా ఊహించిన దానికంటే వేగంగా సాఫ్ట్‌వేర్‌ పరిశ్రమ రికవరీ అవుతోందని హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ అసోసియేషన్‌ (హైసియా) ప్రెసిడెంట్‌ భరణి కె అరోల్‌ తెలిపారు. 2020-21కి దేశీయ పరిశ్రమ 2.6 శాతం వృద్ధితో 194 బిలియన్‌ డాలర్లకు చేరగలదని అంచనా వేస్తుంటే.. తెలంగాణ పరిశ్రమ 7 శాతం వృద్ధితో రూ.1.4 లక్షల కోట్ల ఆదాయాన్ని ఆర్జించగలదని భావిస్తున్నట్లు చెప్పారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2021-22) తెలంగాణ ఐటీ పరిశ్రమ ఆదాయ అంచనాలు, కొత్త ఉద్యోగాలు మొదలైన అంశాలపై ‘ఆంధ్రజ్యోతి’తో చర్చించారు. ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు..


2021-22లో తెలంగాణ ఐటీ పరిశ్రమ వృద్ధిరేటు ఎలా ఉంటుంది?

వచ్చే ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ ఐటీ పరిశ్రమ వృద్ధిరేటు 11-12 శాతం ఉండగలదని అంచనా. దీని ప్రకారం పరిశ్రమ ఆదాయం దాదాపు రూ.1.54 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 7 శాతం వృద్ధి నమోదు కాగలదని.. ఆదాయం రూ.1.4 లక్షల కోట్ల కు చేరగలదని నాస్‌కామ్‌ అంచనా. 2020-21లో తెలంగాణ ఐటీ పరిశ్రమ 20 వేల ఉద్యోగాలు కల్పించింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇది 30,00కావచ్చు. డిజిటల్‌ టెక్నాలజీల్లో ఉద్యోగావకాశాలు పెరగనున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో మొదటి రెండు త్రైమాసికాలు వృద్ధి వేగం తక్కువగా ఉన్నా.. తర్వాతి రెండు త్రైమాసికాల్లో దేశీయ ఐటీ పరిశ్రమ ఊపందుకునే వీలుంది. మొత్తం పరిశ్రమ ఆదాయంలో 15 శాతం తెలంగాణ నుంచి లభిస్తోంది. 


ఐటీ వృద్ధికి కారణం ఏమిటి?

ఐటీ కంపెనీలకు పెద్ద పెద్ద కాంట్రాక్టులు లభిస్తున్నాయి. గత రెండు త్రైమాసికాల్లో 10 కోట్ల డాలర్లు మించిన కాంట్రాక్టులు మూడునాలుగు లభించాయి. 100 కోట్ల డాలర్ల కాంట్రాక్టు కూడా లభించింది. జర్మనీకి చెందిన కంపెనీల నుంచి కాంట్రాక్టులు వస్తున్నాయి. ఈ కాంట్రాక్టుల వల్ల హైదరాబాద్‌ పరిశ్రమ కూడా ప్రయోజనం పొందుతుంది. కాంట్రాక్టును బహుళ ప్రాజెక్టులుగా విడగొట్టి కంపెనీలు వివిధ ప్రాంతాల్లోని డెవలప్‌మెంట్‌ సెంటర్లకు అప్పగిస్తాయి. 


డిజిటల్‌ టెక్నాలజీల్లో  ఉద్యోగావకాశాలు ఎలా ఉన్నాయి?

సైబర్‌ సెక్యూరిటీ, కృత్రిమ మేధ, మెషిన్‌లెర్నింగ్‌, క్లౌడ్‌ కంప్యూటింగ్‌, బిగ్‌ డేటా విభాగాల్లో ఉద్యోగావకాశాలు పెరగనున్నాయి. గతంలో మొత్తం ఉద్యోగుల్లో 8 శాతం మంది డిజిటల్‌ టెక్నాలజీ నిపుణులుంటే.. ఇప్పుడు 25 శాతం మందికి చేరారు. వచ్చే 5-10 ఏళ్లలో ఇది 50-60 శాతానికి చేరే వీలుంది.


ఐటీ ఉద్యోగులు మళ్లీ ఎప్పుడు కార్యాలయాలకు వచ్చే వీలుంది?

ప్రస్తుతం పది శాతం కంటే తక్కువ మందే కార్యాలయాలకు వస్తున్నారు. మిగిలిన వారు ఇంటి వద్ద ఉండే పని (డబ్ల్యూఎ్‌ఫహెచ్‌) చేస్తున్నారు. ఈ ఏడాది చివరి నాటికి 60-70 శాతం మంది సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు మళ్లీ కార్యాలయాలకు వచ్చే వీలుంది. 100 శాతం ఉద్యోగులు రావడం ఇప్పట్లో 


పరిశ్రమ అభివృద్ధికి హైసియా ఏం చేస్తోంది?

చిన్న, మధ్య స్థాయి ఐటీ కంపెనీలను ప్రోత్సహించడానికి హైదరాబాద్‌లో క్లౌడ్‌ కంప్యూటింగ్‌ కోసం హైసియా సెంటర్‌ ఆఫ్‌ ఎక్సెలెన్స్‌ (సీఓఈ)ను ఏర్పాటు చేస్తోంది. విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌ సదుపాయాన్ని కల్పించడానికి కంపెనీలకు, ఇంజినీరింగ్‌ కాలేజీలకు ఒక ప్లాట్‌ఫారమ్‌ను ఒక నెలలో ఏర్పాటు చేయనున్నాం. చిన్న, మధ్య స్థాయి ఐటీ కంపెనీలను ప్రోత్సహించడానికి సెక్టోరియల్‌ పాలసీని తీసుకురావాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వాన్ని కోరాం. నెల రోజుల్లో విధాన ముసాయిదా సిద్ధం కానుంది. ఐటీ రంగంలో మహిళ నాయకులను పెంచడానికి ఐటీ ఉమెన్‌ లీడర్‌ ఫోరమ్‌ను ఏర్పాటు చేస్తున్నాం. 

Updated Date - 2021-03-09T07:06:27+05:30 IST