Chitrajyothy Logo
Advertisement
Published: Wed, 06 Apr 2022 14:05:09 IST

అత్యధిక కలెక్షన్లు కొల్లగొట్టిన Top 10 Indian Movies ఇవే.. వీటిలో RRR ఏ ప్లేస్‌లో ఉందంటే..!

twitter-iconwatsapp-iconfb-icon

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ‘ఆర్ఆర్ఆర్’ మ్యానియా నడుస్తోంది. టాలీవుడ్ దర్శక దిగ్గజం ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా నటించిన ఈ సినిమా రికార్డులను తిరగరాస్తూ దూసుకుపోతోంది. విడుదలైన పన్నెండు రోజులకే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ‘భజరంగీ భాయిజాన్(858 కోట్లు)’ సినిమాని వెనక్కి నెట్టి రూ.955 కోట్లతో మూడో స్థానంలో నిలిచింది. కలెక్షన్ల పరంగా అమీర్ ఖాన్ ‘దంగల్’ 1924 కోట్లతో, ప్రభాస్ బాహుబలి 1749 కోట్లతో ఈ సినిమా కంటే ముందు నిలిచాయి.


అయితే.. ఆ రెండు సినిమాలలాగా ‘ఆర్ఆర్ఆర్’ ఇంకా చైనా, జపాన్ వంటి కొన్ని దేశాల్లో విడుదల కాలేదు. కానీ.. ఆ దేశాల్లో సైతం బాహుబలి 2 వల్ల రాజమౌళికి మంచి మార్కెట్ ఏర్పడింది. కాబట్టి అక్కడ కూడా విడుదలైతే ఈ కలెక్షన్స్ ఇంకా పెరుగుతాయి. కానీ.. అక్కడి కలెక్షన్ల పరంగా ఈ సినిమాలకి ఏ మాత్రం పోటీ ఇస్తుందో చూడాలి. కాగా.. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన ఆల్ టైమ్ టాప్ 10 భారతీయ సినిమాల జాబితా ఇలా ఉంది..

 

గ్రాస్ కలెక్షన్స్..

1. దంగల్ - రూ.1924.70 కోట్లు

2. బాహుబలి: ది కన్‌క్లూజన్ - రూ. 1749 కోట్లు

3. RRR - రూ.955.3కోట్లు (12 రోజులు)

4. భజరంగీ భాయిజాన్ - రూ. 902.80 కోట్లు

5. సీక్రెట్ సూపర్ స్టార్ - రూ.830.80 కోట్లు

6. PK - రూ. 742.3 కోట్లు

7. 2.0 - రూ. 654.40 కోట్లు

8. సుల్తాన్ - రూ. 614.90 కోట్లు

9. బాహుబలి: ది బిగినింగ్ - రూ.600.60 కోట్లు

10. సంజు - రూ. 580.10 కోట్లు

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

BollywoodLatest Telugu Cinema Newsమరిన్ని...

Advertisement
Advertisement