Jul 30 2021 @ 22:47PM

ఉక్రెయిన్‌కు ఆర్‌ఆర్‌ఆర్‌

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రబృందం చివరి షెడ్యూల్‌ షూటింగ్‌ కోసం ఉక్రె యిన్‌కు వెళుతోంది. జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, అలియాభట్‌ పై అక్కడ  పాటను చిత్రీకరించనున్నారు. ఇప్పటికే చిత్రీక రణకు అవసరమైన సరంజామాతో యూనిట్‌ జార్జియాకు వెళ్లింది. ఆగస్టు ఒకటిన ప్రధాన తారాగణం బయల్దేరనున్నారనీ, రెండు నుంచి చిత్రీకరణ ప్రారంభించనున్నారని సమాచారం. ఆగస్టు రెండో వారం దాకా చిత్రీకరణలో పాల్గొంటారు. ఈ పాటతో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రీకరణ పూర్తవుతుంది. కీరవాణి స్వరకల్పన చేసిన ఈ పాటను దర్శకుడు రాజమౌళి గ్రాండియర్‌గా తెరకెక్కించనున్నారు. సినిమాకు ఈ పాట ప్రత్యేకాకర్షణగా నిలవనుంది. డి.వి.వి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.